ఈ ప్రపంచంలోని చాలా రకాల జీవులు మనలా రంగులను చూడలేవు. కొన్ని జీవులు కొన్ని రంగులనే గుర్తిస్తాయి. ఇంకొన్ని మనం చూడలేని రంగులు సైతం చూడగలవు. కోతులు మనిషిలా అన్ని రంగులూ స్పష్టంగా చూడగలవు. అలాగే ఎడ్ల ఆటలను చూసినప్పుడు వాటికి ఎరుపు రంగంటే కోపం అని అపోహ పడుతుంటం. ఎడ్ల పోరాటంలోఎర్ర రుమాలును దాని కండ్ల ముందు ఆడిస్తారు. దాంతో ఎద్దు కోపంగా బుస్సుమంటూ వెంటపడుతుంది. అందువలన కొంతమంది ఎరుపు బట్టలు ధరించి పశువుల ముందుకు రావడానికి కూడా భయపడతారు. నిజానికి ఎడ్లు రంగులను గుర్తించలేవు. వాటికి అన్ని రంగులూ ఒకేవిధంగా కనిపిస్తాయి. అయితే ఎరుపు రంగును చూసి ఎడ్లు ఎందుకు బెదిరిపోతాయి అన్న అనుమానం కలగడం సహజమే. ఎడ్లను ఆడించే వాళ్లు ఆకర్షణీయంగా ఉంటుందని ఎరుపురంగును వాటిముందు ఆడిస్తారంతే! ఎడ్లు ఆకుపచ్చ, నీలం, పసుపు.... చివరకు తెల్లరంగు గుడ్డ వాటి కండ్లముందు ఆడించినా సరే... అవి పౌరుషంగా రెచ్చిపోతాయి.