పిరానా...ఇది ఒక రకమైన చేప. ఇవి మధ్యస్థంగాను ఉంటాయి. చిన్న పరిమాణంలోనూ ఉంటాయి. దక్షిణ అమెరికా ప్రాంతంలో విస్తృతంగా కనిపిస్తాయి. ఉత్తర అమెరికాలో కొద్దిగా వేడిగా ఉండే సరస్సులు, నదులలోను, బంగ్లాదేశ్లో కప్తారు సరస్సులోను ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. వీటి మనుగడకు ఎటువంటి ప్రమాదం లేదు. వెండి రంగు మీద ఎరుపు చారికలతో వీటి శరీరం అందంగా ఉంటుంది. 5.5-17 అంగుళాల వెడల్పు, 7.7 పౌండ్ల బరువు ఉంటాయి. చిన్న చిన్న ప్రాణులను, మొక్కలను తింటాయి. సాధారణంగా ఇవి నత్తగుల్లలు, చిన్న చేపలు, ఇంకా నీటి మొక్కలు, గింజలు, పండ్లు బాగా తింటాయి. క్షీరదాలు, పక్షులు వంటివి నీటిలో పడినప్పుడు వాటిని తింటూ విందు చేసుకుంటాయి. వీటికి పదునైన, వాడియైన దంతాలు ఒకే ఒక వరుసలో ఉంటాయి. వెండి రంగులో ఉండే వంపు తిరిగిన పంటితో ఇతర ప్రాణులను కరుస్తాయి. దృఢంగా వీటి దవడ ఎముకలు ఆయుధంలా పనిచేస్తాయి. మనిషి చేతిని కేవలం 10 సెకన్లలో నుజ్జు చేసేయగలవు. షార్క్ చేపల్లాగే, వీటికి కూడా ప్రత్యేకమైన జ్ఞానేంద్రియం ఉంది. దాని ద్వారా నీటిలోని రక్తాన్ని ఇట్టే పసిగడుతుంది. స్థానికులు వీటి పళ్లతో పనిముట్లు, ఆయుధాలు తయారుచేస్తారు. ఇవి వాటి జాతికి చెందిన చేపలనే ఆహారంగా తినేస్తాయి. వేరే మాంసం దొరకని సందర్భాలలో మాత్రమే ఇలా చేస్తాయి. మానవులను సైతం సెకన్ల సమయంలో మింగేస్తాయి. ఇవి గుంపులుగా నివసిస్తాయి. ఒక్కో గుంపుకి సుమారు 1000 ఉంటాయి. ఇవి సుమారు 5000 గుడ్లు పెడతాయి. వీటిలో 90 శాతం వరకు బతుకుతాయి. ఆడ, మగ పిరాన్లు వీటిని జాగ్రత్తగా పొదుగుతాయి.
Authorization