జ్వరం అనేది ఒక వ్యాధి కాదు. శరీరంలో ఏ నలత ఏర్పడినా లేక సూక్ష్మ జీవ కారకాలు (ఫారిన్ బాడీస్) శరీరంలోకి ప్రవేశించినా శరీరంలోని రక్షణ వ్యవస్థ వాటిని ఎదుర్కోవడానికి ప్రయత్నాలు మొదలుపెడుతుంది. ఈ సమయంలో రక్షణ వ్యవస్థకు ఎక్కువ శక్తి కావాల్సి ఉంటుంది. అందువల్ల శరీరం శ్వాసక్రియను వేగవంతం చేసి ఎక్కువ మొత్తంలో శక్తిని విడుదల చేస్తుంది. ఆ శక్తి వల్ల శరీరం వేడి ఎక్కువ అవుతుంది. ఆరోగ్యంగా ఉన్న మానవుని శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఉంటే జ్వరంగా ఉన్న భావన వ్యక్తికి కలుగుతుంది. అప్పుడు శరీరంలోని జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైమ్లన్నీ నిర్వీర్యమవుతాయి. ట్రిప్సిన్, పెప్సిన్, లైపేజ్, స్టియాప్సిన్ లాంటి ఎంజైమ్లు పనిచేయవు. అదేవిధంగా గ్యాస్ట్రిన్, సెక్రిటిన్, కొలిస్టో కైనిక్ లాంటి హార్మోన్ వ్యవస్థ కూడా సహకరించదు. అలాంటి సమయంలో ఆహారం తీసుకొంటే జీర్ణాశయంలో కొంతకాలం ఉండి, జీర్ణం కాక బయటకి వాంతుల రూపంలో నెట్టివేస్తుంది. జ్వరం తీవ్రంగా ఉంటే తడిగుడ్డతో పొట్ట, నుదురు, కాళ్లు, చేతులు తుడిస్తే నెమ్మదిస్తుంది. అందువల్ల జ్వరంగా ఉంటే పండ్లరసాలు, తేలికగా జీర్ణమయ్యే గ్లూకోజ్ ద్రావణం లాంటివి తీసుకుంటే బాగా ఫలితముంటుంది.
Authorization