బ్రౌన్ క్రీపర్... ఇది అటవీ ప్రాంతంలో కనిపించే పిచ్చుక వంటి పక్షి. దీన్నే 'చెట్లపై తిరిగే ఎలుక' అనీ పిలుస్తారు. చెట్ల మానుపై చుట్టూరా తిరుగుతూ ఎక్కుతూ, చిటారు కొమ్మలపైకి ఎగురుతుంటుంది. చలికాలం ఎక్కువగా కొన్ని పక్షులు చెట్ల తొర్రల్లో దాగిఉంటాయి. ఇవి ఎక్కువగా యూరప్, ఆసియా నుంచి తూర్పు జపాన్ వరకూ కనపడతాయి. ఇవే మరికొన్ని కాకాసస్, హిమాలయ పర్వతాల్లో, అలాగే ఉత్తర అమెరికా అంతటా కనపడతాయి. ఇది అచ్చం పెద్ద పిచ్చుకలాగానే ఉంటుంది. బూడిద రంగు చిన్న ఈకలతో ఉంటుంది. పొట్టభాగం తెల్లగా ఉంటుంది. పొడుగ్గా వొంపు తిరిగిన గోళ్లతో నాలుగు వేళ్లు కలిగి ఉంటుంది. 0.42 ఔన్సుల బరువు, 5 అంగుళాల పొడవు ఉంటుంది. వీటి రెక్కలు 8.5 అంగుళాలు విస్తరిస్తాయి. ఏప్రిల్, ఆగస్టు మధ్య 6 వరకూ గుడ్లు పెడతాయి. ఇవి ఎక్కువగా కీటకాలను, చలికాలంలో కొన్నిరకాల విత్తనాలను తింటాయి. తొమ్మిది సంవత్సరాల వరకు జీవిస్తాయి.