కాలక్షేపానికైతే కావల్సినన్ని ఆటలుంటాయి. కానీ మన సృజనకి పదునుపెట్టేవైతే కాసింత ఉపయోగం కదా! అందుకే తేలిగ్గా వచ్చేసే ఫింగర్ ఆర్ట్ నేర్చుకుంటే సరి! ఇదైతే ఒకరు నేర్పించాల్సిన పనీ లేదు, ఖర్చుతో కూడుకున్నదీ కాదు. ఒక్క నల్లసిరా పెన్నుంటే చాలు వేళ్లతో భావాలను పలికించేయొచ్చు. అందుకు చేయాల్సిందల్లా వేళ్ల మీద ముఖాలను చిత్రించడమే. ఎలాగో తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడండి. దీని ఆధారంగా మీ వేళ్లనే కాన్వాసు చేసేయండి. తమాషా ఏంటంటే ... వేలిపై ఎటువంటి చిత్రాన్ని వేసినా ఏదో ఒక భావం కనిపిస్తుంది. అందుకే సాధన చేస్తూ పోతే వేళ్లతోనే నాటికలు కూడా వేయవచ్చు.