21వశతాబ్ధంలో ఉద్భవించిన శాస్త్రజ్ఞులలో అగ్రగణ్యుడు. తన అనన్య సామాన్య ప్రతిభా సామర్థ్యాలతో, శాస్త్రీయ ప్రపంచ గతివిధులనే మార్చివేసి, విప్లవాత్మకమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఐన్‌స్టీన్. మరి ఈరోజు అంతగొప్ప వ్యక్తి జన్మించిన రోజు.. ఆయన గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందామా...
-మహా శాస్త్రజ్ఞులలో అగ్రగణ్యుడైన, ఐన్‌స్టీన్ దక్షిణ జర్మనీలోని ఉల్మ్ పట్టణంలో 1879 మార్చి 14న జన్మించారు. తాను పుట్టిన ఒక్క సంవత్సరంలోనే తండ్రి మానిచ్ పట్టణానికి మారాడు. అతను ఒక ఎలక్ట్రో కెమికల్ ఫ్యాక్టరీకి యజమాని, ఐన్‌స్టీన్‌కి బాల్యంలో మాటలు రావడం ఆలస్యమైంది. ఇతరులలో కలిసి ఆటపాటలలో పాల్గొనడం చాలా అరుదు. అలాంటి సాధారణ బాలుడు పెరిగి పెద్దవాడై ఇంత చరిత్ర సష్టిస్తాడని ఎవరూ కలలోనైనా ఊహించలేదు.
- ఐన్‌స్టీన్ తల్లిదండ్రులు యూదులు ఆయినప్పటికీ, మతాలపట్ల అతని తండ్రికి ఏ విధమైన ప్రత్యేక అభిరుచి లేదు. తన కొడుకుని కేథలిక్ ఎలిమెంటరీ స్కూలులో చేర్చాడు. 10సంవత్సరాల వయస్సులో జిమ్నాషియంలో ప్రవేశించాడు. అది సెకండరీ స్కూలు. స్కూలంటే అతనికి అభి రుచిలేదు. తండ్రితోపాటు ఇటలీ వచ్చాడు. తండ్రికి వ్యాపారంలో నష్టం రావడంతో కుటుంబం కష్టాలపాలయ్యింది.
- ఇక తప్పని సరి అయి స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ పట్టణంలోనే ఫెడరల్ పాలిటెక్నిక్ స్కూల్లో చేరాడు. లెక్కలలో అసాధారణ ప్రజ్ఞ ఉన్నా ఇతర భాషలలోనూ బయాలజీలోనూ బలహీనంగా ఉండడంతో అసలు ఆ పాలిటెక్నిక్‌లో సీటురావడమే కష్టమైంది కాని, గణితశాస్త్రంలో అతని అఖండ ప్రజ్ఞను గుర్తించి, ఆ ప్రఖ్యాత పాలిటెక్నిక్‌లో సీటు దొరికింది.
- చదువు పూర్తికాగానే ఐన్‌స్టీన్‌కి ఉద్యోగం దొరకలేదు. ఫిజిక్స్ టీచర్ కావాలని అతని అభిరుచి, కాని తండ్రి ఆర్థిక కష్టాలు చూసి, స్విట్జర్లాండ్‌లోని బెర్న్ పట్టణంలో పేటెంట్ ఆఫీసులో ఒక సాధారణ ఉద్యోగిగా చేరాడు. ఆఫీసులో పని ఎంతో వున్నా అక్కడ చేరిన మూడు సంవత్సరాలలోనే గణితశాస్త్రం పరి శోధనలో తన అఖండ ప్రజ్ఞత్వాన్ని నిరూపించాడు. పట్టుదల ఉంటే సాధించలేనిది లేదు. ప్రకతి వైచిత్రి గురించి నిరంతరం ఆలోచిస్తూ .. ఫిజిక్స్‌లో సిద్ధాంతపరమైన పరిశోధనకు అంకురార్పణ చేశారు. కాంతివేగం న్యూటన్ సిద్ధాంతానికి అనుగుణంగా లేదని మైజిల్సన్ అనే ఆమెరికన్ శాస్త్రజ్ఞుడు గుర్తించాడు. ఐన్‌స్టీన్ ఆ పరిశోధన ఆధారం చేసుకుని సాపేక్ష సిద్ధాంతం ప్రతిపాదించాడు.
- ఐన్‌స్టీన్ అంత వరకు ఎవరూ ఊహించని అత్యద్భుత విషయాలను వెలుగులోకి తెచ్చాడు. తన అభిప్రాయం ప్రకారం కదలకుండా ఒకచోట స్థిరంగా ఉండే గడియారం కంటే, అతి వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు ఉన్న గడియారం నెమ్మదిగా తిరుగుతూ కాలాన్ని సూచి స్తుంది. అది గడియారంలోని మెకానికల్ లోపంవల్ల కాదు. యదార్థంగానే జరుగుతుంది.
- ఎంతో క్లిష్టమైన ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన సిద్ధాంతాలు ప్రపంచాన్నే సంభ్రమాశ్చర్యాలలో ముంచె త్తాయి. అంత వరకు ఉన్న భావాలను అవి తలక్రిందులు చేశాయి. సూర్యుడు తనలో వున్న పదార్థాన్ని శక్తిగా రూపొందించుకొంటున్నాడు. కాబట్టి ఇన్ని సంవత్సరాలు దేదీప్యమానంగా వెలుగొందుతున్నాడని ఐన్‌స్టీన్ సిద్ధాంతం రూపొందించింది. లేబరేటరీ పరిశోధన ద్వారా ప్రయో గాత్మకంగా ఐన్‌స్టీన్ సిద్ధాంతమే యదార్థమని సైంటిస్టులు కనుగొన్నారు. అంత పెద్ద మహా శాస్త్ర జ్ఞుడు పేటెంట్ ఆఫీసులో సాధారణ ఆఫీసరుగా ఉండడమేమిటని సిగ్గుపడి ఐన్‌స్టీన్‌ను జ్యురిచ్ యూనివర్శిటీ ప్రొఫెసర్‌గా నియమించారు. ఖండ ఖండాతరాలలో అతని ఖ్యాతి వ్యాప్తిచెందింది.
- అమెరికా ఆహ్వానంపై ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రిన్స్‌స్టన్ యూని వర్శిటీలో ''ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ స్టడీస్''కి డైరెక్టర్‌గా నియమించారు. 1955 ఏప్రిల్ 18న మరణించే వరకు ఆ యూనివర్శిటీలో తన పరిశోధన కొనసాగించాడు. 1905 సంవత్సరం లోనే క్వాంటమ్ థియరీపై చేసిన పరిశోధనకు ఆయనకు నోబెల్ బహుమతి లభించింది.
- తన సాపేక్ష సిద్ధాంతం ద్వారా అంతరిక్షంలో కాలంను, శూన్యం,కష్ణ బిలాలు, అంతరిక్షంలో వ్యోమోగాముల వయస్సు తగ్గుట, బంగారం మెరవడం, కాంతి వేగం, కాంతి స్వభావం, నావిగేషన్ మొదలగు ఎన్నో అనువర్తనాలుమన నిత్య జీవితంలో చూడవచ్చు.
ఐన్‌స్టీన్ శాస్త్రవేత్తే కాదు ఒకతత్వవేత్త కూడా. మానవులకు యుద్ధం కాదు. శాంతి కావాలని ఎలుగెత్తి చాటాడు. మనిషికి స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు కావాలని, విద్య ద్వారానే మనిషి అభివ ద్ధి చెందుతాడని, ప్రజాస్వామిక విధానంలోనే విద్య అభివద్ధి చెందుతుందని స్పష్టం చేశాడు.
Authorization