అగ్నిపర్వతం బద్దలైనప్పుడు 'లావా' ఎగిసిపడుతూ ఉంటుది కదా! అప్పుడు దాన్లో, 'వెసికల్స్' అనే గాలి బుడగలు ఇరుక్కుంటాయి. ఇలాంటి లావా గాల్లోకి ఎగజిమ్మినప్పుడు వేడిగానే ఉన్నా, క్షణాల్లో గట్టిపడి రాయిగా మారుతుంది. అప్పుడు దాన్లో ఇరుక్కున్న గాలి బుడగలు రాతిలో రంధ్రాలుగా మిగిలిపోతాయి. దాంతో, రంధ్రాల రాళ్లు తయారవుతాయి. ఇవే ... 'ప్యూమిస్' రాళ్లు. ు తేలికగా ఉంటాయి కాబట్టి, ఇవి నీటిలో మునగవు. వీటిని తెలుగులో చిట్టెపు రాళ్లు. అయితే ఈవిధంగా ఏర్పడిన రాళ్లు చాలా రకాలుగా ఉపయోగపడుతాయి. ఈ రాతిపొడి 'పోజోలాన్'కు సున్నం కలిపి కాంక్రీటుగా ఉపయోగిస్తారు. దీన్లో విద్యుత్తు ప్రవహించదు. కాబట్టి ఈ కాంక్రీటు ఇటుకలతో కట్టిన ఇండ్లు విద్యుత్‌షాక్ కొట్టవు. ు జీన్స్ ప్యాంట్లు ఎంత ఎక్కువ వెలిసిపోతే అంత అందం. అలా కనిపించడం కోసం జీన్స్ తయారీ పరిశ్రమల్లో ఈ రాతిపొడిని ఉపయోగిస్తారు. ు ఈ రాళ్లు గరుకుగా ఉంటాయి కాబట్టి, దంత మంజనం, రబ్బర్లు, సౌందర్యసాధనాల తయారీల్లో ఉపయోగిస్తారు. ు మృత చర్మాన్ని తొలగించడానికి ఈ రాళ్లు బాగా ఉపయోగపడతాయి. పాదాలు, మడమల దగ్గర పగుళ్లు రాకుండా ఈ రాయితో రుద్దుకుంటారు.