హారు చిన్నారులూ... మన శరీరంలో ఎంతో ముఖ్యమైనవి కండ్లు. ప్రపంచాన్ని చూపించి మనకు వెలుగునిచ్చేవి. ఆడుకోవాలన్నా, చదువుకోవాలన్నా....
ఏం చెయ్యాలన్నా కండ్లు సరిగా పనిచేస్తేనే. అందుకే మన పెద్దవాళ్లు నయనం ప్రధానం అన్నారు. మరి వాటి విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ చేసినా ప్రమాదమే.
- కండ్లు కాంతిని గుర్తిస్తాయి. ఇవి కెమెరాలా పనిచేసి దృశ్యాన్ని మెదడుకి అందిస్తాయి. అయితే అధిక శ్రమ, ఒత్తిడి, వంటివి కండ్లకి అపాయం. అందుకే ఈ జాగ్రత్తలు పాటించాలి.
- మనలో మనకు తెలియకుండా జరిగేది కనురెప్పలా ర్పటం. ఒక మనిషి ఏడాదికి దాదాపు 80 లక్షల సార్లు కనురెప్పలని ఆర్పుతాడట. అలా జరిగేదెందు కంటే..మన కంటి రెప్పల కింద అనేక అశ్రు గ్రంథులు ఉంటాయి. కండ్లు మూసి తెరిచినప్పుడు ఉప్పగా ఉన్న ద్రవం ఊరి, కండ్లు రాపిడి కాకుండా చేస్తాయి. ఈ ద్రవం వల్ల కండ్లు పొడిబారిపోవు. కనురెప్పలు మాటిమాటికీ ఆర్పటమనేది అధిక కాంతి, ధూళి నుంచి కండ్లను కాపాడ్డమన్నమాట.
- కంట్లో ఏమన్నా పడితే వెంటనే నులమకూడదు. ఒక గ్లాసు నిండా మంచినీరు తీసుకుని, ఆ నీరు తగి లేట్లుగా కంటిని ఉంచాలి. అలా పదిహేను సెకన్ల పాటు కంటిని ఉంచి, కనురెప్పలను ఆర్పుతూ ఉంటే నలుసు బయటకి వచ్చేస్తుంది. అదీ కాకుంటే అమ్మకి చెబితే జాగ్రత్తగా నలుసుని బయటకు తీస్తుంది.
ట పుస్తకాన్ని 30 సెం.మీ దూరంలో ఉంచి పడుకుని కాకుండా నిటారుగా కూర్చుని చదవాలి.
- పుస్తకంపై సరిపడా వెలుతురు పడేలా చూసుకోవాలి. కదులుతున్న కుర్చీలో వద్దు. అలా చదివితే కండ్లకు అలసట కలుగుతుంది.
- గంటకు మించి టీవీ చూడొద్దు. వివిధ భంగిమల్లో కూర్చుంటే వెన్నెముకకి ప్రమాదం. టీవీకి కనీసం పది అడుగుల దూరంలో ఉండి చూడాలి. దీపం టీవీకి వెనకవైపు ఎత్తులో ఉంటే మంచిది. బాగా రాత్రి వరకూ నిద్రమాని టీవీ ముందు కూర్చోవద్దు.
- ఎండలో బయటికి వెళ్తే సన్‌గ్లాసెస్ పెట్టుకోండి. వాటివల్ల సూర్యకాంతిలో ఉండే అతినీలలోహిత (అల్ట్రా వయొలెట్) కిరణాలు నేరుగా కండ్లని తాకవు. దుమ్ము, ధూళిపడకుండా కూడా ఈ అద్దాలు రక్షణగా ఉంటాయి. అలాగే బయట నుంచి తిరిగి వచ్చిన తర్వాత శుభ్రమైన నీటితో కండ్లు కడుక్కోవాలి.
- ముఖ్యంగా కంప్యూటర్ ముందు కూర్చుంటే ...కంప్యూటర్ తెర మధ్యభాగం కంటే కాస్త పైన మీ చూపు ఉండాలి. తరచూ రెప్పవేస్తూ మధ్యలో విరామం తీసుకోవాలి. కాళ్లు నేలమీద ఆన్చి వెన్నెముకను నిటారుగా ఉంచాలి. దృష్టిని తీక్షణంగా ఉంచొద్దు. కండ్ల మీద నేరుగా కాంతి పడకుండా యాంటీగ్లేర్ స్క్రీన్ ఏర్పాటు చేసుకోవాలి.
- ఈ జాగ్రత్తలతో పాటు కండ్లు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. తాజా ఆకుకూరలు, కూరగాయలు, పాల పదార్థాలు, గుడ్లు, తాజా చేపలు, ఉల్లి, వెల్లుల్లి, సోయా, ద్రాక్ష, తాజా పండ్లు, తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు, క్యారెట్, బీట్రూట్, మునగాకులు, కాడలు, పసపురంగు కూరలు... వీటిని క్రమం తప్పకుండా మన ఆహారంలో చేర్చుకుంటే ఒమేగా ఫ్యాటీ 3 ఆమ్లాలు, మినరల్స్, విటమిన్ ఎ, సి, ఇ వంటివే కాక అనేక పోషక పదార్థాలు అందుతాయి. ఇవి రేచీకటి, కండ్లు మసకబారటం, పొడిబారిపోవడం, కంటి చూపు మందగించటం, కంటివాపు, ఎరుపు వంటి కండ్ల సమస్యలు రాకుండా కాపాడుతాయి.ట కండ్లు కాంతిని గుర్తిస్తాయి. ఇవి కెమెరాలా పనిచేసి దృశ్యాన్ని మెదడుకి అందిస్తాయి. అయితే అధిక శ్రమ, ఒత్తిడి, వంటివి కండ్లకి అపాయం. అందుకే ఈ జాగ్రత్తలు పాటించాలి.
- మనలో మనకు తెలియకుండా జరిగేది కనురెప్పలా ర్పటం. ఒక మనిషి ఏడాదికి దాదాపు 80 లక్షల సార్లు కనురెప్పలని ఆర్పుతాడట. అలా జరిగేదెందు కంటే..మన కంటి రెప్పల కింద అనేక అశ్రు గ్రంథులు ఉంటాయి. కండ్లు మూసి తెరిచినప్పుడు ఉప్పగా ఉన్న ద్రవం ఊరి, కండ్లు రాపిడి కాకుండా చేస్తాయి. ఈ ద్రవం వల్ల కండ్లు పొడిబారిపోవు. కనురెప్పలు మాటిమాటికీ ఆర్పటమనేది అధిక కాంతి, ధూళి నుంచి కండ్లను కాపాడ్డమన్నమాట.
Authorization