జింకల కుటుంబంలోకెల్లా అతి పెద్ద జింక జాతి జీవి మూస్. ఇవి ఉత్తరార్ధగోళంలోని చల్లటి ప్రాంతాల్లో నివసిస్తాయి. ఆడజీవులూ, మగవీ దాదాపు 4-6 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. అయితే మగవి చాలా ఎక్కువ బరువుగా ఉంటాయి. మగవాటి బరువు 430 కేజీలకు పైగా ఉంటుంది. ఆడ మూస్ బరువు 340 కేజీలు ఉంటుంది. అవి మొక్కలను, ఆకులను తిని బతికే శాకాహార జీవులు. ఒకసారి అవి 50 కేజీల వరకు కడుపులో పట్టేలా ఆహారాన్ని తినేస్తాయి. వాటికి ముందువైపున పళ్లు ఉండవు గానీ నోటిలో 32 పళ్లుంటాయి. బాగా ఈదగలవు. గంటకు తొమ్మిది కిలోమీటర్ల వేగంతో రెండు గంటలపాటు ఈదుతూనే ఉండగలవు. చాలా వేగంగా పరుగెత్తుతాయి. గంటకు దాదాపు 50 కి.మీ. వేగంతో అవి పరుగెత్తగలవు. వాటికొమ్ములు యాంటెన్నాలా విస్తరించి ఉంటాయి. అవి నివసించే చోట వసంతకాలం నుంచి చలికాలం వరకు మగ మూస్ జింకలకు ఈ యాంటెన్నాల వంటి కొమ్ములు పెరుగుతాయి. ఆ తర్వాత అవి రాలిపోతాయి. క్రితం ఏడాది కంటే ఆ మరుసటి ఏడాది ఆ యాంటెన్నా కొమ్ముల సైజు మరింత పెరుగుతుంది. వాటి అవయవా లన్నింటిలో ఈ యాంటెన్నా లాంటి కొమ్ములే వేగంగా పెరుగుతాయి. వాటి వెడల్పు ఒక్కోసారి ఆరడుగుల వరకు ఉంటుంది. వీటి సహాయంతో పోరాటంలో తోటి మగ జీవులను గెలవడం, ఆడవాటిని ఆకర్షించడం కోసమే ఈ వెడల్పాటి కొమ్ములు ఉపయోగపడుతాయి. గర్భం ధరించిన ఆడజింకలు ఎనిమిది నెలల పాటు బిడ్డను కడుపున మోస్తాయి. కొన్ని కవలలకు జన్మనిస్తాయి. తల్లి జింకలకు తమ బిడ్డల విషయంలో సంరక్షణ గుణం ఎక్కువ. తమ బలమైన గిట్టలతో తమ వేట జంతువులను అవి బలంగా తన్నగలవు. సాధారణంగా మూస్ జింకలు 15-25 ఏండ్లు జీవిస్తాయి.
Authorization