పక్షులు, జంతువులు, మనుషుల కన్నా ఎంతో క్రమశిక్షణ కలవి. కష్టపడి పనిచేస్తాయి. ఎప్పుడూ చురుగ్గా ఉంటాయి. ఉదాహరణకు కోడిపుంజు. అలారం టైమ్పీసులు రాకముందు కోడికూత విని నిద్రలేచేవారు. సరిగ్గా సమయానికి లేస్తాయి. మనల్ని లేపుతాయి. చీమల నుంచి కష్టపడి పనిచేయడాన్ని, కుక్కల నుంచి విశ్వాసాన్ని, కాకుల నుంచి ఐకమత్యాన్ని, గాడిద నుంచి బరువులు మోయడాన్ని, కోకిల నుంచి కమ్మగా పాడటాన్ని, పిల్లి నుంచి చురుకుదనాన్ని, నెమలి నుంచి అందంగా నడవడాన్ని, గుర్రం నుంచి వేగంగా పరుగెత్తడాన్ని నేర్చుకోవచ్చు. కోతుల నుంచి చలాకీదనాన్ని, కొంటెతనాన్ని నేర్చుకోవచ్చు. ఆవునుంచి సాధువుగా ఉండటాన్ని, గుడ్లగూబల నుంచి రాత్రిపూట చూడగలగడాన్ని నేర్చుకోవచు,. అంతేకాదు, జంతువులు అకారణంగా ఒక దానితో ఒకటి కలహించుకోవు. ఆహారం కోసం కాకుండా మరో జంతువును అన్యాయంగా చంపవు. ఉడతలు, లేళ్లు, చిరుత పులుల నుంచి కూడా వేగాన్ని నేర్చుకోవచ్చు. పెద్దపులుల న ఉంచి వేటను, సింహం నుంచి నాయకత్వ లక్షణాలను నేర్చుకోవచ్చు.