హాయ్ నేస్తాలూ...! మీరు జూకి వెళ్లారు కదా! ఎన్నోరకాల జంతువులు ఉంటాయి. వాటిని దూరం నుంచే చూసి ఆనందిస్తుంటాం. ఇంకా క్రూరమృగాల సంగతి చెప్పనక్కర్లేదు.
బోన్లలో బంధించి ఉన్నా భయం భయంగా చూస్తూ తప్పు కుంటాం. కానీ అలాంటి క్రూర జంతువులతో స్నేహం చేసిందో పాప. నదురు బెదురు లేకుండా వాటితో చెట్టాపట్టాలేసుకుని ఆఫ్రికా అడవంతా తిరిగేసింది. ఇంతకీ ఎవరా పాప?
- ఈ పాప అమ్మానాన్నలు అలైన్ డెగ్రే, సిల్వీ రాబర్ట్. వాళ్లది ఫ్రాన్స్. వీరు వత్తిలో భాగంగా అడవి జంతువులను ఫొటో తియ్యడానికి ఆఫ్రికా వచ్చినప్పుడు ఈ పాప జన్మించింది. పేరు టిప్పి డిగ్రే.
- ప్రపంచంలో ఎవరికీ లేని ఓ అద్భుతమైన ప్రత్యేకత ఆమె సొంతం. 1990, జూన్ 4న పుట్టిన టిప్పికి ఆఫ్రికా అడవే పుట్టిల్లు. ఆమె చిన్నతనం అంతా ఆఫ్రికాలోని ఎడారుల్లోనే గడిచిపోయింది. అందుకే ఆమెకు అనేక క్రూరమృగాలు స్నేహితులయ్యాయి. 28 ఏండ్ల ఆఫ్రికా ఏనుగు 'అబు', జెబి అనే చిరుత, బోలెడన్ని సింహం కూనలు, నిప్పుకోళ్లు, కంచర గాడిదలు, జిరాఫీలు, మొసలి, అతిపెద్ద బుల్ కప్ప, ముంగిస, పాము కూడా టిప్పితో జతకట్టేశాయి.ఇక వీళ్ల జలకాలాటలు, ఎడారి ఆటలకు అంతే ఉండేది కాదు.
- టిప్పి పెంపకాన్ని అడవికే వదిలేశారు ఆమె తల్లిదండ్రులు. పదేండ్ల వయసు వరకూ టిప్పి అక్కడి జంతువులతో సహవాసం చేస్తూ పెరిగింది. అక్కడి తెగ ప్రజల్లో (బుష్మెన్) కలిసిపోయి భాషతోపాటు వేట కూడా నేర్చుకుంది.
- ఆఫ్రికా అడవిలో టిప్పి పూర్తిగా పదేండ్లు గడిపేసింది. ఆ తర్వాత తల్లిదండ్రులతో పాటు తిరిగి ఫ్రాన్స్ చేరుకుంది. అక్కడ 1998లో టిప్పికి అడవి జంతువులతో ఉన్న 'టిప్పి ఆఫ్ ఆఫ్రికా, మై బుక్ ఆఫ్ ఆఫ్రికా' అనే రెండు పుస్తకాలుగా అచ్చువేయించారు. దాంతో టిప్పి పేరు ప్రపంచమంతా మారుమోగిపోయింది.
Authorization