కావాల్సిన వస్తువులు: పేపర్ ప్లేటు, క్రేయాన్లు, పెన్సిల్, కత్తెర, జిగురు తయారీ ఇలా... ఒక పేపర్ ప్లేట్లో బొమ్మలో చూపినట్లు ఒక వృత్తాన్ని గీసుకొని, కత్తెరతో కత్తిరించాలి. అలా కత్తిరించగా వచ్చిన వృత్తాన్ని బాతు తలగా అతికించాలి. మరో చిన్న ముక్కను బాతు ముక్కులా కత్తిరించుకోవాలి. అలా తయారైన బాతుపై క్రేయాన్లతో గానీ, స్కెచ్ పెన్నులతో గానీ కన్ను, రెక్కలు గీసుకోవాలి. మరో పేపర్ ప్లేటును సగానికి మడిచి, బాతుకు ఒకవైపు అతికించాలి. ఆ ప్లేటు బాతుకు ఆధారంగా ఉండి, ముందుకూ వెనక్కీ ఊగడానికి ఉపయోగపడుతుంది.