మానవ శరీర నిర్మాణానికి, పిల్లుల శరీర నిర్మాణానికీ మధ్య వ్యత్యాసం ఉంటుంది. పిల్లుల కండరాలు, ఎముకలు తేలికగా ఉంటాయి. దీనికి తోడు ఎత్తు మీది నుంచి దూకేటప్పుడు శరీరాన్ని మూపురంలా చేసి, కిందపడేటప్పుడు కాళ్లు సరిగ్గా నేలమీద ఆనేలా చూసుకుంటాయి. అంటే పైనుంచి దూకేటప్పుడు శరీరాన్ని మూపురంలా చేసి, కిందపడేటప్పుడు కాళ్లు సరిగ్గా నేలమీద ఆనేలా చూసుకుంటాయి. అంటే పైనుంచి దూకేటప్పుడు వాటి శరీరం ఒక చిన్న పారాచూట్‌లా మారుతుందన్నమాట. దానికి తోడు వాటి ఎముకలు, కండరాలు షాక్‌లను తట్టుకునేందుకు అనువుగా ఉంటాయి. పిల్లుల కాళ్లకింద మెత్తని దిండ్ల వంటి అమరిక ఉంటుంది. అందుకే వాటికి దెబ్బ తగలదు. అదే మనుషుల విషయానికొస్తే ఎముకలు కండరాలతో పాటు శరీరం బరువు కూడా ఎక్కువే. ఎత్తు మీది నుంచి దూకినప్పుడు కాళ్లు రెండూ సమతూకంలో నేలను తాకవు. అందుకే మనుషులకు దెబ్బలు తగులుతాయి.