కప్పలు ఎక్కువగా నీటిలోనే ఉంటాయి కానీ నీళ్లు తాగవు. ఎందుకంటే అవి తమ చర్మంతో నీటిని సంగ్రహిస్తాయి. వీటికి కండ్లు, ముక్కు తలమీద ఉంటాయి. అందుకే నీటిలో ఉన్నా శ్వాసను తేలికగా తీసుకుంటాయి. అన్నిటినీ చూడగలవు. కప్పల ముందరి కాళ్ల కంటే వెనక కాళ్లు బలంగా, పొడవుగా ఉంటాయి. అందువల్ల అవి తేలికగా ఈదుతాయి. ఎత్తుకు ఎగరగలుగుతాయి. వీటికి నోటి ఫైభాగంలో మాత్రమే పళ్లుంటాయి. కింద వరుసలో ఉండవు. అయితే ఇవి పళ్లతో ఆహారాన్ని నమలవు. అమాంతం మింగేస్తాయి! కప్పలు ఉప్పు నీటిలో బతకలేవు. అందుకే సముద్రాల్లో కప్పలు ఉండవు. ఇవి జీవితంలో కండ్లే మూయవు. నిద్రపోయేటప్పుడు కూడా తెరిచే ఉంటాయి. అంతేకాదు ముందుకి, వెనక్కి, పక్కలకి ఒకేలా చూడగలుగుతాయి. వీటి స్వరం తీవ్ర స్థాయిలోఉంటుంది. బెకబెకలు మనకు చిన్నగా వినిపిస్తాయి కానీ, పూర్తిస్థాయిలో అరిచాయంటే మైలు దూరం వరకూ వినిపిస్తాయి. పాముల్లాగే కప్పలు కూడా తమ చర్మాన్ని వదిలేస్తాయి. అదికూడా వారానికోసారి. అలా వదిలిన చర్మాన్ని అవే తినేస్తాయి. గోల్డెన్ డార్ట్్ అనే జాతి కప్పలు విషపూరితమైనవి. ఒక్కో కప్పలో వెయ్యిమందిని చంపేంత విషం ఉంటుంది.