చైనా నిర్మాణాలు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి వింతైన నిర్మాణాల్లో ఈ అద్దాల వంతెనను ఒకటిగా చెప్పవచ్చు. 430 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పు ఉండే అద్దాల వంతెన నిర్మాణాన్ని రెండు శిఖరాగ్రాల మధ్య ఝాంగ్జియాజీ లోయ పైన నిర్మించారు. 984 అడుగుల ఎత్తులో ఈ అద్దాల వంతెన ఉంది. ప్రపంచంలోనే అతి పొడవైన, అతి ఎత్తైన అద్దాల వంతెన ఇదే కావడం విశేషం. పర్యాటకులు ఎంతటి భయస్తులైనా ఎలాంటి భయం లేకుండా ఈ అద్దాల వంతెనపై నడవచ్చు.
అద్దాల వంతెన మరో ప్రత్యేకత ఎంటంటే..? దీనిపై నుంచి బంగీ జంప్ చేయవచ్చు. తాడును కాళ్లకు కట్టి, ఎత్తైన ప్రదేశం నుంచి కిందకు దూకే సాహస క్రీడనే బంగీజంప్ అంటారని తెలుసు కదా.. ఈ వంతెనపై ఒకేసారి 800 వందల మంది వరకు నడిచినా ఎలాంటి సమస్య ఉండదు. కింద నుంచి ఈ వంతెనను చూస్తే అసలు కనిపించదు. మేఘాల్లో కలిసిపోయినట్టు ఉంటుంది.
హేమ్ దోతన్ అనే ప్రముఖ ఇజ్రాయిలీ నిర్మాణసంస్థ ఈ అందాల వంతెన డిజైన్‌ను రూపొందించింది. చైనాలో ఇలాంటి అద్దాల వంతెనల నిర్మాణాలు కొత్తేం కాదు. గతంలో కూడా ఇలాంటి వంతెనలు నిర్మించారు.
చైనాలోని లాంగ్యాంగ్ నేషనల్ జియోలాజికల్ పార్క్‌లో ఓ కొండ చివరన అద్దాలతో దారిని నిర్మించారు.. 1010 మీటర్ల పొడవుండే ఈ అద్దాల దారిని నిర్మించడానికి దాదాపు 35 కోట్లు ఖర్చయ్యాయి.
Authorization