హాయ్ నేస్తాలూ... ఈరోజు మనం ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నామో తెలుసా? మనకెంతో ఇష్టమైన అమ్మ గురించి..అవును. మనం నిద్ర లేచిన నుండి నిద్రపోయే వరకు మనకు అమ్మ ఎన్నో చేస్తుంది. అన్నం తినిపిస్తుంది... చదివిస్తుంది... కథలు చెబుతూ నిద్రపుచ్చుతుంది. మన మంచి చెడ్డలు అన్నీ అమ్మే చూస్తుంది.
- మరి అమ్మ ఇన్ని పనులు చేస్తుంది కదా...! మరి అమ్మకు మనం ఏం చేస్తున్నాం...? ఈ ప్రశ్నలోంచి పుట్టిందే మాతృదినోత్సవం.
- ప్రతి ఏటా మే నెల రెండో ఆదివారం మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు! ఈ పండుగ జరుపుకోవడానికి ముఖ్య కారకులు అమెరికాకు చెందిన జూలియా వార్డ్ హోవ్, అన్నా జార్విస్లనే అమ్మలు.
- నిజానికి 1800లోనే జూలియట్ అనే మహిళ, ఈ
పండుగని అల్బియాన్, మిచిగానే అనే ఊర్లలో ప్రారంభించారు. ఆ తర్వాత నుంచి ఆమె కుమారులు తల్లిని స్మరించుకొని ప్రతియేటా పండుగని జరిపేవారు. చుట్టుపక్కల పేదలకి సాయం చేసేవాళ్లు. అంతేకాదు వారికి కూడా మీరు మీ తల్లిని గౌరవించండని చెప్పేవారు. కానీ ఇది పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు.
- 1870 జూలియా వార్డ్ తల్లిమీద ప్రేమతో మాతృదినోత్సవం జరపాలని పిలుపునిచ్చారు. అప్పటినుంచే ఇది ప్రజల దృష్టిలో పడింది. ఆమె బోస్టన్ పట్టణంలో పదేండ్ల పాటు ఎంతో ఘనంగా నిర్వహించారు.
- ఆ తరువాత మాతృదినోత్సవాన్ని చక్కగా ఆచరణలో పెట్టింది మాత్రం అన్నా జార్విస్.1912లో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మదర్స్‌డే అనే సంస్థని స్థాపించింది. దానికి జార్విసే అధ్యక్షురాలు. దాంతో ప్రభుత్వం ఈ తేదీని మార్చలేదు. దాంతో ఈ పండుగ యథావిధిగా కొనసాగింది.
- యునైటెడ్ కింగ్డమ్లో మాతృదినోత్సవాన్ని మదరింగ్ సండే అంటారు.
- ఈరోజు ఎక్కువ గులాబిరంగు పూలు, ఎరుపు రంగు పూలు ఉపయోగిస్తారు. దానర్థం.. ఒక వేల తల్లి తమ వద్ద లేకపోయినా ఎక్కడున్నా సరే సంతోషంగా ఉండాలని కోరుకోవడమట.
- బొలీవియాలో మహిళలు యుద్ధానికి వెళ్లిన సందర్భాన్ని, వాళ్ల పోరాటాలని తలుచుకొని ఈ పండుగ జరుపుకుంటారు.
- మాతృదినోత్సవాన్ని కూడా కొందరు వ్యాపారానికి వీలుగా మలుచుకుంటున్నారు. కొంతమంది ఆ ఒక్కరోజు మాత్రమే తమ తల్లులకు గ్రీటింగ్ కార్డ్ ఇచ్చి శుభాకాంక్షలు చెప్పి వెళ్లిపోతున్నారట. ఆ బాధ్యతా రాహిత్యానికీ, వ్యాపార దృక్పథానికి వ్యతిరేకంగా పోరాడింది జార్విస్.
Authorization