సాధారణంగా ఏ చెట్టుకైనా కాయలు, పండ్లు పువ్వు నుంచి వస్తాయి. సున్నితమైన రెమ్మలకు పువ్వులు పూస్తాయి. మరి పనస చెట్టును ఎప్పుడైనా పరిశీలించారా? దానికి కాయలన్నీ కాండానికే కాసి ఉంటాయి. ఏ చెట్టుకైనా కొమ్మలకే పూత, పిందె, కాయలు వస్తాయి.. ఇది ప్రకృతి సహజం. అయితే పనస చెట్టు విషయంలో ఇలా ఎందుకు జరుగుతుందంటే.. పనస పండు బాగా ఎదిగిన చెట్టు కాండానికి కాస్తుంది. మేడి చెట్టుకు కూడా ఈవిధంగానే కాస్తాయి. ఆడపుష్పాలు మాను మీద లేదా బాగా ఎదిగిన కొమ్మల మీద పూస్తాయి. వృక్షాలు అందించే పండ్లలో చాలా బరువుండే పండు ఇదే. ఇంతటి బరువును మోయాలంటే చెట్టుమానుకే సాధ్యం. అదే ఏ రెమ్మకో, కొమ్మకో వేలాడితే కాయ బరువుకి చెట్టు కొమ్మలు విరిగిపోవచ్చు. అందుకే ప్రకృతి పనస వంటి కొన్ని చెట్ల విషయంలో ఈవిధమైన ఏర్పాటు చేసిందన్నమాట.