బ్రౌన్క్రీపర్.. ఇది అటవీ ప్రాంతంలో కనిపించే పిచ్చుక వంటి పక్షి. దీన్నే 'చెట్లపై తిరిగే ఎలుక' అనీ పిలుస్తారు. చెట్ల మానుపై చుట్టూరా తిరుగుతూ ఎక్కుతూ, చిటారుకొమ్మలపైకి ఎగురుతూ ఉంటుంది. చలికాలం ఎక్కువగా కొన్ని పక్షులు చెట్ల తొర్రల్లో దాగి ఉంటాయి. ఇవి ఎక్కువగా యూరప్, ఆసియా నుంచి తూర్పు జపాన్ వరకూ కనపడతాయి. ఇవే మరికొన్ని కాకాసస్, హిమాలయ పర్వతాల్లో, అలాగే ఉత్తర అమెరికా అంతటా కనపడుతాయి. ఇది అచ్చం పెద్ద పిచ్చుకలానే ఉంటుంది. బూడిదరంగు చిన్న ఈకలతో ఉటుంది. పొట్టభాగం తెల్లగా ఉంటుంది. పొడుగ్గా వొంపుతిరిగిన గోళ్లతో నాలుగు వేళ్లు కలిగిఉంటుంది. 0.42 ఔన్సుల బరువు, 5 అంగుళాల పొడవు ఉంటుంది. వీటి రెక్కలు 8.5 అంగుళాలు విస్తరిస్తాయి. ఏప్రిల్, ఆగస్టు మధ్య 6 వరకూ గుడ్లు పెడతాయి. ఎక్కువగా కీటకాలను, చలికాలంలో కొన్ని రకాల విత్తనాలను తింటాయి. తొమ్మిది సంవత్సరాల వరకు జీవిస్తాయి.