లిమర్స్.. పొడవాటి కుచ్చులాంటి తోక, దానిపై నలుపు తెలుపు చారలు కలిగి ఉంటుంది. ఇవి అడవిలో 19 ఏండ్లు, పెంపు డు జంతువుగా 27 ఏండ్లు బతుకుతాయి. వీటి ముఖం చిన్నదిగా నల్లగా ఉంటుంది. ఇవి సుమారు 3.5 కేజీల బరువుంటాయి. వీటిని ఎక్కువగా తోకతోనే గుర్తిస్తారు. శరీరం నల్లగా ఉంటుంది. కండ్లు పసుపు లేదా నారింజ రంగులో ఉంటాయి. రింగుల లిమర్స్ 30 చొప్పున కలిసి తిరుగుతుంటాయి. వీటిలోనూ ఆడ లిమర్స్ ఎక్కువ. నివాస ప్రాంతాలను వాసన ద్వారా గుర్తిస్తాయి. ప్రమాద సంకేతాలను గట్టిగా అరిచి ఇతరులకు తెలియజేస్తాయి. వీటి వేట కారణంగా త్వరగా అంతరించిపోతున్నాయి.