చిన్న చిన్న చేతి గడియారాల నుంచి పెద్ద పెద్ద పరిశ్రమల్లోని ఇంజన్ భాగాల్లోనూ కీలకంగా ఉంది చక్రం. జెట్ ఇంజన్లు, కంప్యూటర్ డిస్క్ డ్రైవ్ల వరకూ అన్నింటా చక్రమే చక్రం తిప్పుతోంది! క్రీ.పూ. 3,500 సంవత్సరాల్లో మెసపటోమియాలో కుండల తయారీకి వాడినట్టు చరిత్ర చెబుతోంది. అయితే రవాణా వ్యవస్థలో చక్రాలని ఎప్పుడు వాడారనేది కూడా అక్కడే 3,200లో రథాలకు వాడినట్టు చెబుతారు. చక్రాలను రవాణా సౌకర్యాల కంటే వివిధ వస్తువుల తయారీకి వాడారన్న విషయం ఆశ్చర్యంగా ఉంటుంది. చక్రాన్ని ఇరుసుతో కలిపే కడ్డీతో తయారు చేసేవారు. మొదటిసారిగా చక్రాలను క్రీ.పూ. 20000లో ఈజిప్టు వాసులు వాడారని తెలుస్తుంది. ఒక ఐరోపాలో క్రీ.పూ. 1400 నాటికి చక్రాలు అభివృద్ధి చెందాయి. పారిశ్రామిక విప్లవంతో ప్రపంచ వ్యాప్తంగా వివిధ రకాలుగా ఎన్నో రకాలుగా ఎన్నో యంత్రాలతో చక్రాల వాడకం అభివృద్ధి జరిగింది.