భూమి 3/4 వ వంతు నీటితో నిండి ఉందన్న సంగతి తెలిసిందే. సముద్రాల్లో ముఖ్యమైనవి మధ్యధరా సముద్రం, అట్లాంటిక్, పసిఫిక్, హిందూ మహాసముద్రాలు. ఆర్కిటిక్ సముద్రం అట్లాంటిక్ సముద్ర భాగంగా తీసుకోవచ్చు. సాధారణంగా సముద్రంలోని నీరు నీలంగానే కనిపిస్తుంది. అయితే చిత్రమేమంటే, మధ్యధరా సముద్రంలో నీరు నీలం రంగులో, అట్లాంటిక్ సముద్రంలో నీరు ఆకుపచ్చగానూ, డెడ్ సీ అంటే మృత సముద్రంలోని నీరు నల్లగానూ కనపడతాయి. ఈ రంగుల వ్యత్యాసం ఆయా నీటిపై సూర్యకాంతి విస్తరణ ఆధారంగా జరుగుతుంది. నీటిపై సూర్య కాంతి పడి విస్తరించినపుడు ఆ నీటిలో కలిసిన పదార్థాల ఆధారంగానే రంగులో తేడా కనపడుతుంది. సాధారణంగా సూర్యకాంతి ఏడురంగుల్లోకి నీలమే ఎక్కువగా విస్తరిస్తుంది. కాగా ఆకుపచ్చ రంగు ఆ నీటి అడుగున మొక్కలు, చెట్లు క్షీణించడం వల్ల వస్తుంది.