ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన నగరం జరికో. ఇది జోర్డాన్‌కు పశ్చిమంగా ఇజ్రాయిల్‌లో ఉంది. మృత సముద్రానికి ఆరు మైళ్లు ఉత్తరంగా సముద్రమట్టానికి 824 అడుగుల లోతున ఉంది. 1967లో ఇక్కడి జనాభా 6829 మాత్రమే. జరికో నగరానికి గొప్ప చారిత్రక ప్రాముఖ్యం ఉంది. ప్రపంచం అంతటికీ మొట్టమొదటి నివాస స్థలంగా భూగర్భ సంబంధమైన రుజువులు అక్కడ దొరికాయి. క్రీస్తు పూర్వం 10,00,000 సంవత్సరం క్రితం నాగరికతా చిహ్నాలు అక్కడ ఏర్పడ్డాయి. ఓల్డ్టెస్ట్మెంట్లోనూ, న్యూటెస్ట్మెంట్లోనూ 'జరికో' నగరం పేరు కనిపిస్తుంది. క్రీస్తు పూర్వం 8000 సంవత్సరాల నాటికి ఇక్కడి ప్రజలు నివాసాల చుట్టూ ఒక పెద్ద గోడ నిర్మించుకున్నారు. క్రీ.పూ. 1000 సంవత్సరం ప్రాంతంలో ఇక్కడ వ్యవసాయం ప్రారంభమైంది. క్రీ.పూ. 5000 సంవత్సరాల నాటికి ఇక్కడి ప్రజలు మట్టి పాత్రలను వినియోగించారు. ఆ తర్వాత జరికో నగరం అనేక మార్పులకు లోనైంది. 1949లో జరికో జోర్డాన్‌లో కలిసిన తర్వాత బాగా విస్తరించింది.