జీబ్రా ఈక్విడే (గుర్రాల కుటుంబం) కుటుంబానికి చెందిన క్షీరదం. ఇది ఆఫ్రికాకు చెందినది. మైదానాల్లో ఉండే జీబ్రా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిఉంది. కొండ ప్రాంతాల్లో జీబ్రాలకు, మైదాన ప్రాంతాల్లో ఉండేవాటికి వొంటిమీద ఉన్న చారల్లో తేడాలు ఉంటాయి. జీబ్రాల శరీరం మీద ఉండే చారలనుబట్టి ఒక్కోదాన్ని విడివిడిగా కూడా గుర్తించే అవకాశం ఉంటుంది. జీబ్రాలకి కంటిచూపు, వినికిడి శక్తి అమోఘంగా ఉంటుంది. ఇవి గంటకి 40 మైళ్ల దూరం పరుగెత్తగలుగుతాయి. జీబ్రా పిల్లలు పుట్టిన తర్వాత ఒక గంటకే పరుగెత్తగలుగుతాయి. జీబ్రా పిల్లలు పుట్టిన తర్వాత ఒక గంటకే పరుగెత్తుతాయి. ప్రాచీన రోమ్‌లో జీబ్రాలకి శిక్షణనిచ్చి సర్కస్‌లో బండ్లులాగడానికి ఉపయోగించేవారు.