పిల్లలూ! మనం కడుపు నిండా అన్నం తింటున్నామంటే దానికి కారణం... వ్యవసాయ రంగంలో వచ్చిన కొన్ని విప్లవాలు.. మన పూర్వీకులు కడుపునింపుకోవడం కోసం ఎన్నో కష్టాలు పడేవారు. దాన్ని అధిగమించి నేడు మనం ఇలా జీవిస్తున్నామంటే వ్యవసాయరంగంలో వచ్చిన అనేక విప్లవాల ఫలితమే..
- విప్లవం వర్ధిల్లాలి అనే మాట మనం తరచూ వింటుంటాం. అసలు విప్లవం అంటే ఏంటో తెలుసా.. ఫ్రెండ్స్... ఒక సమస్య నుంచి బయటపడేందుకు, స్వయం సమృద్ధి సాధించేందుకూ చేసే పోరాటమే విప్లవం. అదే వ్యవసాయ రంగంలోనూ వచ్చింది.
- స్వాతంత్య్రం వచ్చేప్పటికి మన దేశాన్ని కొన్ని సమస్యలు పీడిస్తున్నాయి. 1960 నాటికి జనాభా విపరీతంగా పెరిగిపోయింది. ఆహార పంటలు అందరికీ సరిపడా పండించుకోలేకపోవడంతో వ్యవసాయ రంగంలో బాగా వెనకబడ్డాం. రష్యా, అమెరికా, దేశాల నుంచి వరి, గోధుమ దిగుమతి చేసుకునేవాళ్లం. ఈ సమస్యని అధిగమించేందుకు ఎమ్.ఎస్. స్వామినాథన్ నేతృత్వంలో 'హరిత విప్లవం' వచ్చింది.
- అధిక దిగుబడిని ఇచ్చే వంగడాలను ప్రవేశపెట్టి, రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం, నీటిపారుదల సౌకర్యాల కల్పన ద్వారా అధిక ఆహార ఉత్పత్తిని సాధించడమే హరిత విప్లవ ప్రధాన లక్ష్యం. నార్మన్ బోర్లాగ్ ప్రపంచవ్యాప్తంగా హరిత విప్లవానికి నాంది పలికాడు. అందువల్లే ఆయన్ను హరితవిప్లవ పితామహుడుగా పేర్కొంటారు.
- ఇలాంటి విప్లవాలు మనదేశ వ్యవసాయ రంగంలో ఇంకా చాలా ఉన్నాయి. అవేంటంటే...
- వైట్రెవల్యూషన్:
పాలు, పాల ఉత్పత్తుల పరిశ్రమలు. వర్గీస్ కురియన్ను శ్వేత విప్లవ పితామహుడుగా పేర్కొంటారు. మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కూడా పిలుస్తారు.
- పింక్ రెవల్యూషన్:
ఉల్లి, ఔషధాలు, రొయ్యల ఉత్పత్తులు
- బ్లూ రెవల్యూషన్:
చేపల ఉత్పత్తులు, ప్రొఫెసర్ హీరాలాల్ ఛౌదురిని నీలి విప్లవ పితామహుడుగా పేర్కొంటారు.
- బ్లాక్ రెవల్యూషన్:
పెట్రోలియం ఉత్పత్తులు
- రౌండ్ రెవల్యూషన్:
బంగాళ దుంపల అధిక దిగుబడి కోసం
- రెడ్ రెవల్యూషన్:
మాంసం, టొమాటోల ఉత్పత్తులు
- సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్:
పత్తి ఉత్పత్తులు
- బ్రౌన్ రెవల్యూషన్:
తోళ్ల పరిశ్రమల అభివృద్ధి, సంప్రదాయ ఇంధన వనరుల అభివృద్ధి
- గ్రీన్రెవల్యూషన్:
వరి, గోధుమ, ఇతర ఆహార ధాన్యాల దిగుబడి
- గోల్డెన్ రెవల్యూషన్:
తేనె, పండ్లు, ఉద్యానవనాల అభివృద్ధి
- యెల్లో రెవల్యూషన్:
నూనె గింజల ఉత్పత్తులు
- ఎవర్గ్రీన్ రెవల్యూషన్:
సంపూర్ణ వ్యవసాయిక అభివృద్ధి
- గ్రే రెవల్యూషన్:
ఎరువుల పరిశ్రమల అభివృద్ధి
- సిల్వర్ రెవల్యూషన్:
గుడ్లు, పౌల్ట్రీ అభివృద్ధి
- గోల్డెన్ ఫైబర్ రివెల్యూషన్:
జనపనార ఉత్పత్తులు
Authorization