లెపార్డ్ టార్టాయిస్ నేలమీద జీవించే జీవి. ప్రపంచంలో తాబేలు జాతికి చెందినవాటిలో అతిపెద్ద నాలుగవది. ఆఫ్రికాలో ఎక్కువగా ఉంటాయి. తీర ప్రాంతంలోను, గడ్డి భూములలోను ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని ఆహారం కోసం, పెంచుకోవడం కోసం వేటాడుతున్నారు. వీటి మనుగడ ప్రమాదస్థాయిలో ఉంది. ఇవి 16-28 అంగుళాల పొడవు, 40-120 పౌండ్ల బరువు ఉంటాయి. వీటి శరీర పైభాగం పసుపుతో కూడిన గోధుమ రంగులో ఉండి, పైన నల్లటి మచ్చలుంటాయి. ఇవి చూడటానికి చిరుతపులి మీద ఉండే మచ్చల్లాగ ఉంటాయి. అందువల్లే వీటికి ఈ పేరు వచ్చింది. రాతినేలల్లో సైతం సులువుగా ప్రయాణిస్తాయి. పూర్తిగా శాకాహారులు. ఇవి ఒంటరిగా జీవిస్తాయి. ఇవి సుమారు 100 ఏండ్ల వరకు బతుకుతాయి.