మహాసముద్రాలలో భూమధ్య రేఖకు సమీపంలోఉండే వెచ్చని జలాల్లో అప్పుడప్పుడూ వచ్చే శక్తివంతమైన తుఫానులనే హరికేన్లు లేదా ఉష్ణమండల తుఫానులు అంటారు. పసిఫిక్ మహాసముద్రం పశ్చిమ ప్రాంతంలో వచ్చే ఈ రకమైన తుఫానులనే హరికేన్లు అంటారు. హరికేన్లు అపసవ్యదిశలో తిరుగుతూ ముందుకు సాగుతుంటాయి. వీటిలోని గాలి గంటకు కనీసం 119 కిలోమీటర్ల వేగంతో చాలా బలంగా వీస్తుంది. మహాసముద్రాలలో మొదలయ్యే హరికేన్లు అప్పుడప్పుడూ భూభాగాలపైకి కూడా దూసుకొస్తాయి. అలావచ్చేటప్పుడు అవి సముద్రం నుంచి పెద్ద మొత్తంలో నీటి ఆవిరిని తీసుకొస్తాయి. హరికేన్లు భూభాగాలను చేరుకున్నపుడు అవి చల్లబడి, భారీ వర్షాలు కురుస్తాయి. ఆ విధంగా, హరికేన్ల వల్ల చాలా విధ్వంసం జరిగినప్పటికీ, అవి కురిపించే వానల వల్ల చాలా ప్రయోజనం కూడా చేకూరుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా సుమారు 100 హరికేన్లు సంభవిస్తాయి.