హయ్ నేస్తాలూ...! ఏ దేశం ఎక్కడుందో తెలుసుకోవాలంటే మనం అట్లాస్ పుస్తకమో, లేదంటే గ్లోబో చూస్తాం. మరి మ్యాపేరియం చూశారా? అంటే ఏంటి అంటారా? ప్రపంచ దేశాలను మరింత స్పష్టంగా చూపించేదే మ్యాపేరియం. దీని గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం...
- అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రం, బోస్టన్ నగరంలో ఉందీ మ్యాపేరియం. 'మేరి బేకర్ ఎడ్డీ లైబ్రరీ'లో గ్లోబు ఆకారంలో ఉన్న దీనిని చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతుంటారు.
ష గ్లోబులా ఉన్న గదిలోకి వెళితే అక్కడి అద్దాల్లోంచి ఖండాలు, దేశాలు, వాటి సరిహద్దులను చూడవచ్చు. పుస్తకాల్లో వివిధ దేశాల మ్యాపులున్నప్పటికీ వాటి పరిమాణం, సరిహద్దుల విషయంలో చాలా తేడాలుంటాయి. అంతేకాదు పుస్తకంలో మ్యాపుని చూసి నేర్చుకోవడాన్ని పిల్లలు బోర్‌గా ఫీలవుతారు.
- 30 అడుగుల ఎత్తుతో ఉన్న ఈ మ్యాపేరియాన్ని 1935 సంవత్సరంలో నిర్మించారు. బోస్టన్‌కు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ చెస్టర్లిండ్సే చర్చిల్ దీని రూపకర్త. 1930 లో 'న్యూయార్క్ డైలీ న్యూస్' హెడ్‌ఆఫీసును చర్చిల్ సందర్శించాడు. ఆ భవనం ముందు 12 అడుగుల ఎత్తుతో ఉన్న గ్లోబ్ చర్చిల్‌ను ఆకట్టుకుంది. అలాంటిదాన్నే తాను నిర్మించాలని చర్చిల్ అనుకున్నాడు. అలా 1932 సంవత్సరంలో మ్యాపేరియం నిర్మాణం మొదలు పెట్టాడు. మూడు సంవత్సరాల తర్వాత అంటే 1935లో దాన్ని ప్రారంభించాడు. మ్యాపేరియం నిర్మాణం కోసం దాదాపు 24 లక్షల రూపాయల్ని ఖర్చు చేశాడు.
- 1935లో దీన్ని నిర్మించడంతో అప్పటి దేశాల పేర్లు, సరిహద్దుల ఆధారంగా దీన్ని రూపొందించారు. దీంట్లో మొత్తం 608 గాజు పలకలున్నాయి. మ్యాపులని ఎప్పటికప్పుడు మార్చుకునేలా వీటిని తయారుచేశారు. 1998 సంవత్సరంలో మ్యాపేరియాన్ని రినోవేషన్ చేశారు. వందల లెడ్లైట్లను అమర్చారు. ఇవి వేవేల వర్ణాలతో మెరుస్తూ మ్యాపేరియానికి సరికొత్త అందాన్ని తీసుకువచ్చాయి. ఈ గది మధ్యలో ఉండి ఎవరైనా మాట్లాడితే అది సాధారణ శబ్దం కన్నా ఎక్కువ ధ్వనితో వినిపిస్తుంది. దీనికి ఆ గది వత్తాకారంలో ఉండటమే కారణం.
- చిన్నారులు సరదాగా గడుపుతూ, విజ్ఞానాన్ని పెంచుకునేందుకు వీలుగా ఈ ప్రపంచపటాన్ని రూపొందించారు. మ్యాపేరియాన్ని మొదట్లో 'ద గ్లాస్ రూం', 'ద గ్లోబ్ రూం'గా పిలిచేవారు. మ్యాపేరియం అనే పదం, మప్పా(మ్యాప్), ఏరియం (ప్లేస్)అనే లాటిన్ పదాలనుంచి వచ్చింది.
- ఒక దేశానికి, మరో దేశానికి ఉన్న దూరం, వాటి సరిహద్దులు అన్నీ కచ్చిత పరిమాణంలో ఉంటాయి. హైదరాబాద్ నుంచి అమెరికాకు ఎంత దూరం, లండన్ నుంచి శాన్ఫ్రాన్సిస్కో ఏ రూటులో వెళ్లొచ్చు వంటి అనేక విషయాలను ఈ మ్యాపు ద్వారా తెలుసుకోవచ్చు.
Authorization