ఆలుగడ్డ మనదేశానికి చెందిన దుంప కాదు. ఇది దక్షిణ అమెరికాలోని ఉత్తర ఆండీస్ పర్వతాల నుండి మనదేశానికి వచ్చింది. మొదట ఇన్కా జాతివారు ఈ దుంప వేరును కాపాడి ప్రత్యేక పంటగాపెంచారు. 15వ శతాబ్దంలో యూరప్‌కి, 16వ శతాబ్దంలో మిగతా దేశాలకూ ఈ బంగాళ దుంప పంటలు వచ్చాయి. ఈ దుంపను పిండి బట్టల తయారీలోనూ ఉపయోగిస్తారు. దీని నుండి బీరును తయారు చేస్తారు. ఈ దుంపల నుండి గ్లూకోజ్, చక్కెర, ఆల్కహాల్‌ను కూడా ఉత్పత్తి చేస్తారు.