తన స్థావరాన్ని ఇతర పక్షులకు తెలిసేలా పాటపాడినట్టు అరుస్తుంటుంది. ఒక విధమైన హెచ్చరిలా. తన స్థావరంగా ఎక్కువ ప్రాంతాన్ని ప్రకటిస్తుంది ఈ పక్షి. ఇటీవలికాలంలో పట్టణపరిసరాల్లోనూ కనపడుతోంది. అజోరస్, ఐస్లాండ్ నుంచి ఉత్తరదిశగా యూరప్, ఆఫ్రికా నైరుతి, దక్షిణ ఆసియా నుంచి చైనా వరకు ఇవి కనపడుతాయి. అలాగే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలోనూ కనపడుతాయి. బ్లాక్ బర్డ్ అననుకూల వాతావరణ పరిస్థితుల్లో కూడా ఆహారాన్ని సంపాదించుకోగలదు. ఇది వలస పక్షి. ఉత్తర యూరప్ నుంచి బ్రిటన్కు వలస వెళ్తుంది. అక్కడ గుడ్లుపెట్టి, పిల్లల్ని తీసుకుని తిరిగి వాటి ప్రాంతానికి తిరుగుప్రయాణమవుతాయి. శత్రు పక్షులు, జంతువుల నుంచి ప్రమాదం ఎదురవుతుంటే గూటిలోని పిల్లలకు అనేక రకాల శబ్దాలు వినిపించి హెచ్చరిస్తుంటాయి. దీని ముక్కు నారింజరంగులో సూదిగా ఉంటుంది. నేలలో బొరియలు తవ్వి క్రిమికీటకాలను పడుతుంది. కంటి చుట్టూ పచ్చని రింగులా ఉంటుంది. మిగతా శరీరమంతా నల్లని ఈకలు కలిగిఉంటుంది. ఇవిఎక్కువగా వానపాములు, పురుగులు, పండ్లు తింటాయి.