న్యాలా...ఇది ఒకరకమైన దుప్పిలా ఉంటుంది. బొవిడ్ కుటుంబానికి చెందినది. దక్షిణాఫ్రికాలో ఎక్కువగా కనిపిస్తాయి. ఎండు గడ్డిభూములలోను, దట్టమైన అరణ్యాలలోనూ నివసిస్తాయి. నిరంతరం నీరు, గడ్డిదొరికే ప్రాంతాలను నివాస స్థానాలుగా ఎంచుకుంటాయి. అయితే తగినంత ఆహారం లభించక పోవడం, రోగాల కారణంగా వీటికి ముప్పు ఏర్పడుతున్నప్పటికీ, వీటి సంఖ్య స్థిరంగానే ఉంది. వీటి మనుగడకు ఎటువంటి ప్రమాదమూ లేదు. 4.5-5.25 అడుగుల పొడవు, 120-280 పౌండ్ల బరువుతో ఉంటాయి. ఆడవాటికంటే మగ న్యాలాలు పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి. మగ న్యాలాల శరీరం మీద ముదురు బూడిద రంగు, లేతరంగు చారలు వంటి కొన్నిగుర్తులు ఉంటాయి. ఆడ న్యాలాలు, పిల్లల శరీరాలు ఎరుపు, గోధుమ రంగుల మిశ్రమంలో ఉంటాయి. వీటి అరుపు కుక్క అరుపులా ఉంటుంది. సింహాలు, హైనాలు చిరుతపులులు, ఆఫ్రికా వైల్డ్ డాగ్స్.. న్యాలాలను చంపి తింటాయి. ఏడు నెలలు గర్భం ధరించాక న్యాలాలు ఒక పిల్లను పెడతాయి. మొదటి మూడు వారాలు పిల్లలు దట్టంగా ఉండే అరణ్యంలో తల్లి రక్షణలో ఉంటాయి. పుట్టిన పిల్లలు ఏడు నెలల వరకు తల్లిపాలు తగ్గుతాయి.