రోజూవారి జీవితంలో అనేకానేక వస్తువులు మనకు ఉపయోగపడుతూనే ఉంటాయి. ఏది లేకపోయినా ఇబ్బందే. అలాంటి చిన్న వస్తువుల్లో సూది ఒకటి. సూదేనా అని చులకన చేయవద్దు. ఇది కుట్టు పనిలో ఎంతగా ఉపయోగపడుతుందో ప్రాణ రక్షణ చేసే ఆపరేషన్లలో అంతకంటే ఎక్కువ ఉపయోగపడుతోంది. ఆదిమానవులు ఎముకలను సూదిగా చెక్కి సూదులుగా వాడేవారు. క్రమేపీ దంతం, ఎముక సూదులు తయరయ్యాయి. ఆ తర్వాత గుర్రపు వెంట్రుక పట్టేటంత రంధ్రంతోటి సూదులు తయారయ్యాయి. కొన్ని రకాల చెట్ల ఆకుల ఈనెలను కూడా సూదులుగా వాడటం జరిగింది. ప్రస్తుతం వైద్యరంగంలో, ఫ్యాషన్లోకంలోనూ విరివిగా వాడుతున్న సూదులు వివిధ రూపాలు సంతరించుకున్నా అసలు రూపం మాత్రం రవ్వంతయినా మారలేదు!