చలికాలం రాగానే అందరికీ ఉన్ని దుస్తులు అవసరమవుతాయి. మరి ఆ ఉన్ని దుస్తులు ఎలా తయారవుతాయంటారు? ఉన్ని దుస్తుల తయారీకి అవసరమైన ఉన్నిని గొర్రెలు, మేకల నుంచి సేకరిస్తారని అందరికీ తెలిసిందే. వాటి శరీరంపై మొలిచే వెంట్రుకలను అవసరమైనంత మేరకు పెరగనిస్తారు. కావలసినంత కొలతమేరకు పెరిగాక వాటిని కత్తిరిస్తారు. వాటిని మెషీన్ల ద్వారా శుభ్రపరిచి ఎండలో ఆరనిస్తారు. ఆరాక వాటిని మళ్లీ మెషీన్ల సహాయంతో దారాలుగా మలుస్తారు. ఇలా తయారైన ఉన్నిని మెత్తనిది, గరుకైనదిగా విడదీస్తారు. మృదువైన ఉన్నితో స్వెటర్లు, మఫ్లర్లు, సాక్సులు, మంకీ క్యాప్‌లు, టోపీలు, గ్లవ్స్.. గరుకు ఉన్నితో తివాచీలు, దుప్పట్లు, డోర్మ్యాట్లు, బ్లాంకెట్లు తయారుచేస్తారు. ఉన్ని తయారీలో మన దేశం ప్రపంచంలో పదోస్థానంలో ఉంది.