చూడటానికి నక్కలా కనిపించే ఈ జంతువు రక్కూన్. ఇవి ఎక్కువగా ఉత్తర అమెరికాలోనే ఉంటాయి. వీటి పొడవు 40-70 సెంటీమీటర్లు. బరువు 3.5-9 కిలోల వరకు ఉంటుంది. ఇవి చలిలో ఉండటానికి అస్సలు ఇష్టపడవు. ఈ రక్కూన్లు చాలా తెలివైనవి. తమ పిల్లలను, జతకట్టిన వాటిని ఎత పెద్ద గుంపులో ఉన్నా ఇవి గుర్తుపట్టేస్తాయి. వీటి పిల్లలను 'కిట్స్' అంటారు. ఇవి సంఘజీవులు. విశ్రాంతి తీసుకునేటప్పుడు, తినేటపుడు, గుంపులుగా కలిసి ఒకేచోట కానిస్తాయి. మగ రక్కూన్లకు కొద్దిగా కోపం, స్వార్థం ఎక్కువే. వాటి పిల్లల జోలికి మిగతా రక్కూన్ పిల్లలను కానీ వాటి తల్లులను కానీ దగ్గరకు రానివ్వవు. పిల్లలు పెద్దయ్యే వరకు వాటిని చాలా జాగ్రత్తగా పెంచుతాయి తల్లి రక్కూన్లు. సాధారణగా వీటి జీవితకాలం 20 ఏండ్లు. కానీ తోడేళ్లు వీటిపై దాడిచేసి చంపి తినేస్తుంటాయి. దాంతో కొన్ని 10 ఏండ్లలోపే చనిపోతుంటాయి. కుక్కకు ఉన్నట్లే రక్కూన్లకు విశ్వాసం చాలా ఎక్కువ