అమెరికాకు చెందిన పాట్రిక్ డౌగెర్టీ... కలప నిర్మాణాలతో అంతర్జాతీయ ఖ్యాతి పొందాడు. ప్రపంచ వ్యాప్తంగా వందలకొద్దీ కలప కట్టడాలను నిర్మించాడు. స్థానికంగా దొరికే చెట్ల కొమ్మలే ఆయన ముడిసరుకు. అవుంటే చాలు...40 అడుగుల భారీ ఇ ళ్లనూ చాకచక్యంగా అల్లేస్తాడు.
1945లో ఓక్లహామాలో పుట్టిన పాట్రిక్ ఉత్తర కరోలినాలో పెరిగాడు. 1967లో కరోలినా విశ్వవిద్యాలయం నుంచి బి.ఎ. పట్టా పొందాడు. తర్వాత 1969లో వైద్యశాస్త్రంలో హెల్త్ అడ్మినిస్ట్రేషన్లో ఎం.ఎ. చేశాడు. దాంతో తృప్తి పడలేదు. తన అభిరుచికి తగ్గట్టు కళాచరిత్ర, శిల్పశాస్త్రాల మీద కూడా అధ్యయనం చేశాడు. ప్రకృతి ఆరాధకుడైన పాట్రిక్ చెట్ల కొమ్మల్ని, నైపుణ్యంగా జతచేస్తూ అల్లిక సాధన చేశాడు. స్థానికంగా లభించి మేపుల్ చెట్ల గూళ్లు అల్లేవాడు. 1982లో నార్త్ కరోలినా మ్యూజియం కోరికమేరకు ఆర్టిస్ట్స్ ఎగ్జిబిషన్లో పెట్టాడు. అది మొదలు.. అమెరికా ఖండంలో 150 ఏండ్లు వెలిశాయి. అలాగే యూరప్, ఆసియి అంతటా కలిపి గత 30 ఏండ్లలోదాదాపు 250 పైనే ఇళ్లు అల్లేశాడురీ అల్లిక పనంతా ఒంటరిగానే చేసుకుంటాడు. ఒక్కో ఇంటి నిర్మాణానికీ 3 వారాల వరకూ సమయం పడుతుందట. పాట్రిక్ నైపుణ్యానికి అంతర్జాతీయ ప్రశంసలతో పాటూ ఎన్నో పురస్కారాలూ లభించాయి. అనేక విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు ప్రాజెక్ట్వర్క్గా ఈ కళను నేర్పిస్తున్నాడు.
Authorization