ఆసియా, యూరప్ ఖండాల్లో కనిపించే కామన్ క్వెయిల్ పక్షి గోధుమ రంగులో గుండ్రంగా ఉంటుంది. పురుగుల్ని, గింజల్ని తింటూ కాలం గడిపేస్తుంది. ఎగిరే శక్తి ఉన్నా నేల మీదే తిరుగుతూ ఉంటుంది. ఒకవేళ అదిలిస్తే కోడిపిల్లలాగా అటూఇటూ పరిగెడుతుంది. శీతాకాలంలో వేల కిలోమీటర్లు వలస వెళ్లే ఈ పక్షులు, దారిలో తినే కొన్ని గింజల వల్ల విషపూరితంగా మారిపోతాయి. ఆ సమయంలో వీటి మాంసాన్ని కనుక తింటే 'కోటర్నిజం' అనే సమస్య ఏర్పడుతుంది. కళ్లు తిరగడం, మూర్ఛపోవడం ఈ వ్యాధి లక్షణాలు. రోమన్ సామ్రాజ్యంలో అయితే ఈ పక్షులను తినడం నిషేధించారట.