అలెగ్జాండర్ ఫ్లెమింగ్ స్టెఫలోకోకై బాక్టీరియా మీద ప్రయోగాలు చేస్తూ ఉండేవాడు. ఒక రోజు ప్రయోగం మధ్యలోనే వదిలేసి ఊరెళ్లిపోయాడు. కొద్దికాలం తర్వాత వచ్చి చూస్తే బూజు (మౌల్డ్) ఉన్న ప్రాంతంలో తప్ప మిగతా చోటంతా బాక్టీరియా పెరిగిపోయింది. ఆ బూజే 'పెన్సీలియం' అనే శిలీంద్రం. దాన్నుంచే బాక్టీరియాను చంపే 'పెన్సిలిన్' మందు తయారైంది.