మన శరీరానికి చిన్న గాయం అయినపుడు మొదట్లో రక్తం కారుతుంది. తర్వాత కొంతసేపటికి దానంతటదే గడ్డకడుతుంది. దీనికి కారణం తెలియాలంటే రక్తంలో ఏవేవి ఉంటాయో తెలుసుకోవాలి. రక్తంలో 'ప్లాస్మా' వంటి ద్రవ పదార్థంతో పాటు ఎర్ర రక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్లెట్స్ ఉంటాయి. రక్తం గడ్డకట్టడానికి కారణం ఈ ప్లేట్లెట్స్. ఇవి గాయం చుట్టూ చేరి రక్తంలో ఉండే ప్లాస్మా నుంచి ప్లాస్టిక్ లాంటి పదార్థాన్ని తయారు చేస్తాయి. రక్తంలో ఉండే కాల్షియంతో ఈ ప్లాస్టిక్ లాంటి పదార్థం కలిసి 'పైబ్రెన్' అనే సన్నటి పోగులు ఏర్పడతాయి. ఈ పోగులు ఒకదానితో మరొకటి ఒక గట్టి చిక్కులాగా ఏర్పడి గాయం నుంచి రక్తం బయటకు పోకుండా అడ్డుకుంటాయి. ఇంతేకాకుండా ప్లేట్లెట్లు తయారు చేసే 'సిరోటిన్' అనే హార్మోన్ గాయం నుంచి వచ్చే రక్తాన్ని కుంచింప చేస్తుంది. ఆ విధంగా మొదట్లో గాయం నుంచి రక్తం కారినా, ఆ తర్వాత గడ్డకడుతుంది.