పిల్లలూ పర్వతం మండటం మీరెక్కడైనా చూశారా? చూడలేదు కదా.. కానీ ఓ చోట ఉన్న పర్వతం మాత్రం నిత్యం మండుతూనే ఉంటుంది. అలాగని అదేమీ అగ్నిపర్వతం కూడా కాదు. మరి మంటలు ఎలా వస్తున్నాయంటారా? ఆ విషయాలు తెలసుకోవాలంటే ఇది చదవండి...
- అది ఆస్ట్రేలియాలోని ఒక పర్యాటక ప్రాంతం. అక్కడ ఒక పెద్ద పర్వతం ఉంది. దాన్నుంచి నిరంతరం పొగలు వస్తుంటాయి. అక్కడ 5,500 ఏళ్ల క్రితం నిప్పు అంటుకుంది. అది ఇంకా మండుతూనే ఉంది. కాబట్టి 'బర్నింగ్ మౌంటేన్' అని కూడా పిలుస్తారు.
- న్యూ సౌత్‌వేల్స్ ప్రాంతంలో ఉన్న ఈ పర్వతం నుంచి నిరంతరం పొగలు వస్తుంటాయి... ఈ మంటలు కొన్ని వందల సంవత్సరాల నుంచి అలా వెలువడుతూనే ఉన్నాయి.
- మొదట్లో ఇదో అగ్ని పర్వతం అనుకునేవారట. 1829లో పరిశోధకుడు సి.పి.ఎన్. విల్టన్ ఈ పర్వతం కింద బొగ్గు నిక్షేపాలున్నాయని, వాటినుంచే మంటలు వస్తున్నాయని కనుగొన్నాడు. దాంతో ఆధునిక ప్రపంచానికి ఈ వింత గురించి తెలిసింది.
- బొగ్గు గని పర్వతం కింద 90 అడుగుల లోతులో మండుతుంటే బయటకు పొగలు వస్తుంటాయి. ఈ ప్రాంతమంతా బూడిదతో తెల్లగా మారిపోయింది. వర్షాలు కురిసినపుడు కాసేపు పొగలు ఆగిపోయినా కానీ లోపలికి వాన నీరు చేరుకోదు. అందుకే గని ఎప్పటికీ చల్లారట్లేదు. మనుషులు కూడా దీన్ని ఆర్పలేకపోయారు.
- ఆస్ట్రేలియాలో వేల ఏళ్ల క్రితమే ఐరోపావాళ్లు ఆవాసం ఏర్పరుచుకున్నారు. అంతకన్నా ముందు నుంచి ఈ మంటలు ఉన్నాయి. మొదట్లో స్థానికులు దీన్ని ఉపయోగించుకొని వంటలు చేసుకోవడం, పనిముట్లు తయారుచేసుకునేవారు.
- స్థానిక భాషలో వింజెన్ అంటే జ్వాల అని అర్థం. అందుకే పర్వతానికి ఆ పేరు పెట్టారు. ఈ ఆరని మంటను చూడ్డానికి రోజూ వేలాది సంఖ్యలో దేశదేశాల నుంచి సందర్శకులు వస్తుంటారు.
- ఇలాంటి బొగ్గు గనే ఒకటి అమెరికాలో కూడా ఉంది. సెంట్రాలియా గనుల్లో 1962లో అంటుకుని ఇప్పటికీ మండుతూనే ఉంది. అయితే ఇది తీవ్రస్థాయిలో ఉండేసరికి ఆ ప్రాంతంలోని ప్రజలంతా ఇండ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు.
- ఈ బొగ్గు గని మంటలకు ఉన్న ఇంకొక విశేషం ఏంటంటే ఎక్కువ కాలం నుంచి రగులుతున్న మంటలు ఇవేనట.
- బొగ్గు గని పర్వతం విశేషాలు బాగున్నాయి కదా పిల్లలూ..!
Authorization