Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్ట్రాజెనెకా ఇండియా ఆవిష్కరణ
హైదరాబాద్ : గుండె విఫలమైన వారిని ఆస్పత్రులలో చేర్చాల్సిన అవసరంతో పాటుగా మరణాల ప్రమాదాన్ని సైతం గణనీయంగా తగ్గించడానికి ఆస్ట్రాజెనెకా ఇండియా డపాగ్లిఫ్లోజిన్ (ఫోర్జిగా)ను అందుబాటులోకి తెచ్చినట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఇది హార్ట్ ఫెయిల్యూర్ (హెచ్ఎఫ్) రోగుల చికిత్స కోసం ప్రభుత్వ అనుమతి పొందిన మొట్టమొదటి యాంటీ డయాబటిక్ డ్రగ్ అని పేర్కొంది. అదే విధంగా కార్డియోవాస్క్యులర్ మరణాలు, హాస్పిటలైజేషన్ ప్రమాదాన్ని తగ్గించడానికి తోడ్పడుతుందని నిరూపించబడిందని తెలిపింది. ప్రామాణిక చికిత్సతో పాటుగా ఫోర్జిగాను సైతం అందించడం ద్వారా కార్డియోవాస్క్యులర్ మరణాల ప్రమాదాన్ని తగ్గించడం లేదా తీవ్రమైన గుండె విఫల ప్రమాదాన్ని 26 శాతం వరకు తగ్గించడం చేస్తుందని ఆస్ట్రాజెనెకా ఫార్మా ఇండియా లిమిటెడ్ ఎండి గగన్‌దీప్ సింగ్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 6.4 కోట్ల మందిలో, భారత్‌లో 80 లక్షల నుంచి కోటి మంది వరకు హార్ట్ ఫెయిల్యూర్ భారిన పడుతున్నారని అంచనా వేశారు. వేగవంతమైన నియంత్రణ సంస్థల అనుమతుల కారణంగా రోగులపై వ్యాధి భారం తగ్గడంతో పాటుగా మరికొంత కాలం వారు జీవించేందుకు అవకాశమూ కలుగుతుందన్నారు.