Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో హైదరాబాద్
ఫిప్త్ జనరేషన్ హౌండా సిటీ కారును హౌండా కార్స్ ఇండియా విడుదల చేసింది. యాంబీషియస్ కాన్సెప్ట్ డిజైన్ తో రూపందించిన అన్ని సెగ్మెంట్లలో ఇదే పోడవైనది, వెడల్పైనదని కార్స్ ఇండియా సీఈవో, ప్రెసిడెంట్ గాకు నకషికి ప్రకటనలో తెలిపారు. అలెక్సా రిమోట్ సామర్థ్యంతో రూపొందించిన ఫస్ట్ కనెక్టెడ్ కారు ఇదే కావడం గమనార్హం. ఐదు సంవత్సరాల సబ్ స్క్రిప్షన్, బోలెడు ఫీచర్లు, అన్ని గ్రేడ్లలో స్టాండర్డ్ ఆఫర్లు దీని ప్రత్యేకం. ఫుల్ ఎల్ఈడీ ల్యాంపులు, జడ్ ఆకారపు అరౌండ్ టెయిల్ ల్యాంపు, జీ మీటర్ తో కూడిన హెచ్ డీ ఫుల్ టీఎఫ్ టీ మీటర్, లేన్ వాచ్ కెమెరా, వెహికిల్ స్టెబిలిటీ అసిస్ట్, ఎజైల్ హ్యాండ్లింగ్ అసిస్ట్ తదితర ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.