Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సికె బిర్లా గ్రూపులో భాగమైన ఓరియంట్ ఎలక్ట్రిక్ లిమిటెడ్ 'యువి సానిటెక్' పేరుతో శానిటైజేషన్ చాంబర్‌ను ఆవిష్కరించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో వెలుపడే అతినీలలోహిత (యువిసి) కాంతి ద్వారా కరోనా వైరస్, బ్యాక్టీరియా, శిలీంద్రాలను సంహరిస్తుందని ఒరియంట్ ఎలక్ట్రిక్ సిఇఒ, ఎండి రాకేష్ ఖన్నా తెలిపారు. 34 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ బాక్స్ ధరను రూ.11,999గా నిర్ణయించామన్నారు. ఒక్క సంవత్సరం వారంటీపై ఆన్లైన్ అమ్మకానికి ఉంచినట్లు వెల్లడించారు.