- పియాజియో ఆవిష్కరణ ముంబయి : ప్రీమియం స్కూటర్ల తయారీదారు పియాజియో వెస్పా వీఎక్స్‌ఎల్, ఎస్‌ఎక్స్‌ఎల్ ఫేస్‌లిఫ్ట్ 2020 శ్రేణి, డిస్క్ బ్రేక్, డిజిటల్ క్లస్టర్‌తో నూతన ఏప్రిలియా స్ట్రామ్ మోడల్‌ను ఆవిష్కరించింది. వినియోగదారులకు ప్రీమియం ఫీచర్ల ద్వారా మెరుగైన సవారీ అనుభవాలను అందించడమే లక్ష్యంగా వీటిని తీసుకొచ్చినట్టు ఆ కంపెనీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. వీటిని తమ ఆన్‌లైన్ పోర్టల్ బుక్ చేసుకోవచ్చని లేదా డీలర్‌షిప్‌ల వద్ద పొందవచ్చని తెలిపింది. నూతన ఏప్రిలియా స్ట్రామ్ 125సిసి డిస్క్ బ్రేక్, డిజిటల్ క్లస్టర్‌తో అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. సాంకేతికాధారిత ఫీచర్లను బ్రాండ్ వెస్పా జోడించడంతో పాటుగా ప్రీమియం అనుభవాలను సష్టిస్తుందని పియాజియో చైర్మెన్, ఎండి డియోగో పేర్కొన్నారు.