Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : టిక్‌టాక్ యాప్‌ను తమకు విక్రయిం చడానికి దాని మాతృసంస్థ బైట్‌డాన్స్ నిరాకరిం చిందని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. టిక్ టాక్‌ను సెప్టెంబర్ 15 లోపు విక్రయించకపోతే నిషేధిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. తమ ప్రతిపాదనకు బైట్‌డాన్స్ అంగీకరించి ఉంటే పౌరుల భద్రతకు అనుగుణంగా మార్పులు చేసేవాళ్లమని, కానీ అలా జరగలేదని మైక్రోసాఫ్ట్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు టిక్‌టాక్ కొనుగోలు పోటీలో తాజాగా ఒరాకిల్ చేరింది. ఈ యాప్ కొనుగోలుకు అనేక సంస్థలు ఆసక్తిగా ఉన్నప్పటికీ బైట్‌డాన్స్ కూడా ఓరాకిల్ వైపే మొగ్గు చూపుతుందని సమాచారం.