Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రెండు దేశాల నడుమ సంఘీభావం మరియు మానవతా మద్దతు యొక్క అసాధారణ చిహ్నంగా, కోవిడ్–19 మహమ్మారితో పోరాడుతున్న భారతదేశానికి సహాయంగా ఉచితంగా పంపిణీ చేసేందుకు ఒక లక్ష హెల్త్ మాస్క్‌లను విరాళంగా Social Welfare Corporation Anguk Zen Center in South Korea, headed by the Venerable Abbot, Subul Sunim అందించింది. ఈ విరాళానికి కొరియాలోని కె–ఆర్ట్ ఇంటర్నేషనల్ ఎక్సేంజ్ అసోసియేషన్ మరియు భారతదేశంలోని InKo Centreలు సమన్వయం చేశాయి.
ఈ సరుకును (దాదాపు 150 మిలియన్ కొరియన్ వోన్) నేడు Mr. Venu Srinivasan, Chairman, TVS Motor Company, and Managing Trustee, Srinivasan Services Trust; Chairman, InKo Centre and Goodwill Envoy for Culture and Diplomacy of the Republic of Korea లు టీవీఎస్ మోటార్ కంపెనీకి చెందిన సామాజిక సేవా విభాగం శ్రీనివాస్ సర్వీసెస్ ట్రస్ట్ ద్వారా ఉచిత పంపిణీ కోసం అందజేశారు. Mr. Venu Srinivasan, Chairman, TVS Motor Company, and Managing Trustee, Srinivasan Services Trust మాట్లాడుతూ ‘‘InKo Centre కు దయార్ద్ర హృదయంతో ఒక లక్ష మాస్క్‌లను విరాళంగా అందించిన నా Venerable Abbot, my revered teacher, Subul Sunim హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాస్కులను ధరించడం, పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు సంబంధించి అత్యంత కఠినమైన నిబంధనలను ఆచరించడం, భౌతిక దూరం పాటించడం అనేవి నూతన సాధారణతగా వెలుగొందుతున్న ఈ సంక్షోభ కాలంలో సమయానికి మరియు అత్యంత విలువైన విరాళాన్ని అందించడాన్ని స్వాగతిస్తున్నాము. దేశవ్యాప్తంగా స్ధానిక సమాజాలకు టీవీఎస్ మోటార్ కంపెనీకి చెందిన సామాజిక సేవా విభాగం శ్రీనివాసన్ సర్వీసెస్ ట్రస్ట్ ద్వారా విస్తృతంగా ఈ మాస్కులను పంపిణీ చేయనున్నామని భరోసా అందిస్తున్నాం. బుసాన్నుంచి చెన్నైకు ఈ సద్భావన మరియు మద్దతు యొక్క వినూత్నమైన పౌర సంజ్ఞ , రెండు దేశాల నడుమ విలువైన బంధాన్ని సూచిస్తుంది’’ అని అన్నారు. Mr Young-seup Kwon, Consul General of the Republic of Korea in Chennai మాట్లాడుతూ ‘‘మానవ సమాజం ఎదుర్కొన్న అతిపెద్ద, అత్యంత తీవ్రమైన సవాళ్లలో ఒకటిగా ఈ మహమ్మారి నిలుస్తుంది. మనం బలంగా ఉండటంతో పాటుగా కలిసికట్టుగా పనిచేయడం ద్వారా ఈ సవాళ్లను అధిగమించగలం. పౌర సమాజ స్ధాయిలో ఈ సహకారం స్పష్టంగా సామాన్య కొరియన్లు మరియు భారతీయులు ఒకరికొకరు ఎంతగా సహకరించుకోగలరో చూపుతుంది. మనం అంతా కలిసికట్టుగా ఉంటే ఈ సవాళ్లను మనం అధిగమించగలం’’ అని అన్నారు.
ఈ అత్యున్నత నాణ్యత కలిగిన మాస్కులను BlueIndus Co. Ltd ఉత్పత్తి చేయగా భారతదేశంలో పంపిణీ కోసం ప్రత్యేకంగా CEO Jeong Cheon-sik అందించారు. ఈ మాస్కులను భారతదేశానికి రవాణా చేయడానికి Mr. Yang Jae-saeng, CEO of Eunsan Shipping Air, Korea సహకరించారు.