Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బీమా ఉత్పత్తులను విక్రయించేందుకు ఎన్ఎస్డీఎల్ పేమెంట్స్ బ్యాంక్‌తో ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ లైఫ్ భాగస్వామ్యం కుదర్చుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. దీని ద్వారా ఎన్ఎస్డీఎల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులు సులభంగా ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ లైఫ్ యొక్క ఉత్పత్తులను పొందవచ్చని పేర్కొంది. నూతన తరపు పంపిణీ టచ్పాయింట్లపై ఉనికిని వద్ధి చేయడంలో ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్‌కు ఈ భాగస్వామ్యం తోడ్పడుతుందని విశ్వాసం వ్యక్తం చేసింది. కాగితపు రహిత, సురక్షిత, క్లిష్టత లేని రీతిలో జీవిత భీమాను ఎన్ఎస్డీఎల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులు కొనుగోలు చేసే అవకాశాన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్ అందిస్తుందని పేర్కొంది. ఆరంభ సూచికగా భద్రతను అందించే టర్మ్ ప్లాన్ 'ఐప్రొటెక్ట్ స్మార్ట్', గ్యారెంటీడ్ మెచ్యూరిటీ ప్రయోజనం అందించే వినూత్నమైన సేవింగ్స్ ఉత్పత్తి 'ఐసీఐసీఐ ప్రు ఏఎస్ఐపీ' అందుబాటులోఉంటాయని ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండి, సిఇఒ ఎన్ ఎస్ కణ్ణన్ తెలిపారు.