Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్బీఐ కొత్త నిబంధనలు
ముంబయి : క్రెడిట్, డెబిట్ కార్డులతో జరిపే అంతర్జాతీయ చెల్లింపులకు ఇకపై ముందస్తు అనుమతి తప్పనసరి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం అక్టోబర్ 1 నుంచి క్రెడిట్ కార్డ్‌లకు సంబంధించి ఇంటర్నేషనల్ ఆన్లైన్ లావాదేవీలకు, కాంటాక్ట్ లెస్ కార్డ్ లావాదేవీలకు బ్యాంక్‌ల అనుమతి పొందాల్సి ఉంటుంది. బ్యాంకు కార్డు మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని బ్యాంకులు, కార్డులను జారీ చేసే కంపెనీలు డెబిట్, క్రెడిట్ కార్డుల అనవసర అంతర్జాతీయ డిజిటల్ చెల్లింపు సేవలను తీసివేయాలని ఆదేశించింది. కార్డు వినియోగదారుడు ఆసక్తి మేరకు ఆ సౌకర్యాలను కల్పించాలని ఆదేశించింది. ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా ఖాతాదారులు ఈ మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు.