Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సోనాలిక ట్రాక్టర్స్ ప్రస్తుత ఏడాది సెప్టెంబర్ నెలలో రికార్డ్ స్థాయిలో 46 శాతం వృద్థితో 17,704 యూనిట్లను విక్రయించినట్లు ప్రకటించింది. ఎగుమతులతో కలుపుకుని ఈ పెరుగుదలను సాధించినట్లు పేర్కొంది. దేశీయంగా 51.4 శాతం పెరుగుదలతో ఏకంగా 16,000 యూనిట్ల అమ్మకాలు చేసినట్లు తెలిపింది. గతేడాది ఇదే మాసంలో 10,571 యూనిట్ల అమ్మకాలు జరిగాయని తెలిపింది. గడిచిన మాసంలో ఎగుమతులు 9.8 శాతం పెరిగి 1,704 యూనిట్లుగా చోటు చేసుకున్నాయని వెల్లడించింది.