Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: అసాధారణంగా గుండె కొట్టుకోవడం మరియు గుండె పనితీరు నిలిచి పోయే సమస్యల్ని ఎదుర్కొనే భారతీయులకు, నూతన ప్రయోజనాలను చేకూర్చే అత్యంత ఆధునిక హార్ట్ రిథమ్ మేనేజ్మెంట్ సామర్థ్యాలు కలిగిన నూతన ఇంప్లాంటబుల్ కార్డియోవర్టర్ డీఫిబ్రిలేటర్ (ICD) మరియు కార్డియాక్ రీసిన్క్రోనైజేషన్ థెరపీ డీఫిబ్రిలేటర్ (CRT-D) ఉపకరణాలను విడుదల చేస్తున్నట్లు అబోట్ నేడు ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ మరియు దానిలోని యాప్‌లతో, దూరంగా ఉంటూనే రోగి గుండె పనితీరును వీటితో తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. రోగి కోరుకునే డిజైన్, మెరుగైన బ్యాటరీ మన్నిక మరియు ఎంఆర్ఐ అనుకూలత తదితరాలు వీటిలో అదనపు ప్రయోజనాలుగా ఉన్నాయి.
‘‘అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 6.1 మిలియన్ల ప్రజలు కార్డియాక్ అరిథ్మియా లేదా అసాధారణ హృదయ స్పందనలతో సమస్యలు ఎదుర్కొంటున్నారని అంచనా. హఠాత్తుగా గుండె కొట్టుకోవడం నిలిచి పోవడమే కార్డియాక్ అరెస్ట్‌గా వ్యవహరిస్తారు. గుండె పనితీరు తగ్గిపోవడం, ప్రాణాంతకం అయ్యే అసాధారణమైన హృదయ స్పందన సమస్యలతో బాధపడే రోగులు కార్డియాక్ అరెస్ట్‌తో మరణించకుండా అడ్డుకునేందుకు మేము ఐసిడిలను సిఫార్సు చేస్తున్నాము. ఈ అసాధారణ హృదయ స్పందనలను వెంట్రిక్యులార్ అరిథ్మియా అని వ్యవహరిస్తుండగా, ఇటువంటి స్థితిని ఎదుర్కొనే వారి గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది లేదా రక్తాన్ని సమర్థవంతంగా పంప్ చేయలేకపోతుందని’’ హైదరాబాద్ కేర్ హాస్పిటల్లో ఎలెక్ట్రో ఫిజియాలజీ మరియు అరిథ్మియా సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ సి. నరసింహన్ వివరించారు.
దీని గురించి ఆయన మరింత వివరిస్తూ ‘‘సాంప్రదాయక ఐసిడిల మాదిరిగానే హఠాన్మరణాలను నియంత్రిస్తూ, గుండె పనితీరును మరింత మెరుగుపరచేందుకు సీఆర్టీ-డి వంటి ఉపకరణాలు కూడా సహకరిస్తుండగా, అదనంగా గుండె పనితీరు మరియు ఇప్పటికే గుండె జబ్బులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోగులకు కనీస వైద్య చికిత్సను అందుబాటులోకి తీసుకు వచ్చినా, గుండె సహజంగా కొట్టుకునే విధానాన్ని పునరుద్ధరించేందుకు ఇవి ఉపయోగపడతాయని’’ తెలిపారు. స్మార్ట్ఫోన్లకు అనుకూలమైన సురక్షితమైన రిమోట్ పర్యవేక్షణ యాప్ అబోట్ నూతన వ్యవస్థను అనుసంధానం చేస్తుంది. దీనితో ఇది శక్తివంతంగా అనుసంధానమై ఉంటుంది మరియు కమ్యూనికేషన్‌ను క్రమబద్ధీకరించేందుకు మరియు వైద్యులు వారి తమ రోగులతో అనుసంధానతను మరింత వృద్ధి చేసుకునేందుకు సహకరిస్తుంది. ఉదాహరణకు, తమ ట్రాన్స్మిషన్ హిస్టరీ మరియు ఉపకరణం పనితీరుకు అనుగుణంగా రోగులు తమ ఆరోగ్య సంరక్షణ బృందాలతో తరచూ సంప్రదించేందుకు యాప్ అనుమతి ఇస్తుంది. యాప్ ద్వారా, వైద్యులు తమ రోగులను దూర ప్రాంతాల్లో ఉంటేనే పర్యవేక్షించే అవకాశంతో పాటు ఆ రోగుల్లో అసింప్టోమాటిక్ ఎపిసోడ్లను గుర్తించేందుకు అదే విధంగా అంతకు మునుపు అందించిన చికిత్సలు, రోగి స్పందనల గురించి తెలుసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది.
‘‘రిమోట్ పర్యవేక్షణతో సానుకూలమైన ప్రభావం ఉంటుందని పలుసార్లు నిరూపితమైంది మరియు రోగి మెరుగైన చికిత్స ఫలితాలను అందుకునేందుకు అవకాశం కల్పిస్తుందని’’ అబోట్ కార్డియాక్ రిథమ్ మేనేజ్మెంట్ బిజినెస్ డివిజనల్ ఉపాధ్యక్షుడు మరియు చీఫ్ మెడికల్ ఆఫీసర్ అవీ ఫిషర్, M.D పేర్కొన్నారు. ‘‘అబోట్లోని డైనమిక్ సాంకేతికత ఇంటి నుంచి దూరంగా ఉన్నప్పుడు కూడా రోగి ఎప్పుడైనా తన వైద్యుడిని సంప్రదించుకునే సామర్థ్యాన్ని అందిస్తుంది మరియు రోగులు వారి సంరక్షకులు మరియు వైద్యుల మధ్య అనుసంధానతను మెరుగుపరచేందుకు ఉపయోగపడే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇందులో అలవర్చడం మా నిబద్ధతను మరింత బలోపేతం చేసుకునేందుకు దోహదపడుతుందని’’ పేర్కొన్నారు.
మెరుగైన రిమోట్ పర్యవేక్షణ సామర్థ్యాలతో పాటు, ఈ CRT-D వ్యవస్థ మల్టిపుల్ పాయింట్ పేసింగ్ మరియు ఆప్టిమైజేషన్ లక్షణాలను కలిగి ఉండడంతో, ఎక్కువ మంది రోగులు CRT చికిత్సలకు ప్రతిస్పందిస్తుంది. అలాగే, ఐసిడి పరికరంలో వైద్యులు వారి రోగి ఉపకరణాలను అప్రయత్నంగానే ప్రోగ్రామ్ చేసేందుకు అబోట్ టైలర్డ్ థెరపీ సూట్ ఇందులో ఉంది. ఈ లక్షణాలను అబోట్ తన నూతన వ్యవస్థల్లో చేర్చడం ద్వారా, రోగికి అవసరమైన నిర్దిష్ట ప్రోగ్రామింగ్ చుట్టూ నిర్మించిన చికిత్సకు ప్రాధాన్యత ఇస్తూ, వారు చికిత్సకు అత్యంత ప్రభావవంతమైన రీతిలో స్పందించేలా చూసుకోవలసిన అవసరం ఉంటుంది.
అబోట్ ఈ ఉపకరణాలను సురక్షితమైన లైఫ్ సైకిల్ విధానంలో రూపొందించగా, వీటిలో తాజా సైబర్ సెక్యూరిటీ నియంత్రణలు, వాటి రూపకల్పన మరియు పరీక్షలలో ఇన్పుట్ అందించడానికి సైబర్ సెక్యూరిటీ పరిశ్రమలోని నిపుణుల భాగస్వామ్య సహకారాన్ని వినియోగించుకుంటుంది. ఈ విధానం భవిష్యత్తులో వృద్ధి చేందుకు అవకాశం ఉన్న సైబర్ సెక్యూరిటీ బెదిరింపుల నుంచి తప్పించుకుంటూ, ఈ ఉపకరణాన్ని మరింత మెరుగైనదిగా ఉన్నతీకరించుకునే సామర్థ్యాన్ని అందిస్తుంది. దీని డిజైన్ అనేది బ్యాటరీ దీర్ఘకాలిక మన్నిక లేదా అధిక వోల్టేజ్ అవుట్పుట్లపై ఏ మాత్రం రాజీపడకుండా ఉంటుంది.