Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఈ రోజు ప్రారంభమైన జూమ్టోపియా2020లోని ప్రధాన భాగంగా Zoom Video Communications, Inc. (NASDAQ: ZM), కమ్యూనికేషన్స్ రంగంలో భవిష్యత్తులో రాబోయే మార్పులకు సంబంధించి దాని ప్లాట్ఫారంలలో చేపట్టబోయే ప్రముఖ అభివృద్ధిని వెల్లడించచబోతోంది. రెండు రోజుల పాటు జరిగే ఈ వర్చ్యువల్ సమావేశం సంస్థ సిఇఒ ఎస్. యువాన్, సంస్థ భవిష్యత్ దృక్కోణం గురించి వివరణతో ప్రారంభమవుతుంది. ఆ తరువాత సంస్థ సిపిఒ ఓడెడ్ గాల్ ముఖ్యమైన ప్రసంగం చేస్తారు. “Zoom అనేది మీకోసం, ధైర్యవంతులైన, శ్రమజీవులైన, మరియు సృజనాత్మకతగల మా యూజర్లకొరకు లభ్యమవుతుంది, అలాగే Zoomtopia కూడా. ఒక ప్రపంచ-స్థాయి, విలువ నిండిన వర్చ్యువల్ కార్యక్రమాన్ని అందించేందుకు మేము కృషి చేస్తున్నాము.అంతేగాక, మీకు ఉత్తమమైన సేవలందించాలన్న Zoom వాగ్దానానికి వాస్తవ రూపం కల్పించేందుకు మేము ప్రణాళికలు రచిస్తున్నాము. సిద్ధం చేస్తూ, దానిని మీకు అందిస్తున్నాము,” అని యువాన్ పేర్కొన్నారు. “ఎంతో సవాలుతో కూడిన ఈ సమయంలో మూలప్రాంతాలనుండి పనిచేస్తుంది. భవిష్యత్తులో వ్యక్తిగతంగా పనిచేయడం మరియు వర్చ్యువల్ కమ్యూనికేషన్ల మిశ్రమ స్థితిని అందిస్తుంది. Zoomtopiaలో మేము ఈ రోజు చేయబోయే ప్రకటనలు, Zoom నేటికాలానికి మరియు ఆతరువాతి కాలానికి సరిపోయేవాటిని ప్రదర్శిస్తుంది. ప్రపంచానికి ఈరోజు, రేపు, ఆ తరువాతి భవిష్యత్తులో ఏంకావాలో అందించేందుకు మావద్ద ప్లాట్ఫారం సిద్ధంగా ఉంది.”
ప్లాట్ఫారం
Zoom ప్లాట్‌ఫారంకు చేసిన పురోగతులలో అతి ముఖ్యమైనవి:
- OnZoom: ఇది Zoom యూజర్లు, ఉచిత, చెల్లింపు జరిపే, మరియు నిధులు సేకరించే ఏర్పాటు తయారు చేసుకొని, హోస్ట్ చేయగలిగే ఒక వన్-స్టాప్ ప్లాట్ఫారం. దీనిని ఉపయోగించి హోస్ట్‌లు తమ వ్యాపారాలను పెంచుకోవడం, కొత్త వినియోగదారులకు విస్తరించుకొని, తిరిగి స్థానిక చందా సమీకృతంతో తిరిగి ఇవ్వవచ్చు. Zoom యూజర్లు ఈ కార్యక్రమాలను ఆవిష్కరించి, గిఫ్టింగ్ టిక్కెట్లు మరియి హాజరయ్యేవారి డ్యాష్‌బోర్డ్ ద్వారా తమకిష్టమైన కార్యక్రమాలు మరియు బ్రాండ్లను అనుసరించే విధానాలను ఉపయోగించుకొని అదనపు పనితీరుతో నూతన అనుభవాలకు సైనప్ చేసుకోవచ్చు. నేటినుండి యుఎస్ యూజర్లకు OnZoom.com.పై పబ్లిక్ బీటా రూపంలో లభ్యమయ్యే దానిని ఉపయోగించుకొని, WW (గతంలో Weight Watchers) వంటి ఎస్‌ఎమ్‌బిలు మరియు ఫ్లాగ్షిప్ కంటెంట్ భాగస్వాములతో సమావేశాలకు హాజరు కావచ్చు.
- కొత్తదైన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ (E2EE) ఆఫరింగ్: ఐచ్చికమైన ఈ లక్షణం సాధారణంగా, ఉచిత మరియు చెల్లింపు జరిపే Zoom యూజర్లకు, సాంకేతిక ప్రివ్యూకై అక్టోబర్ చివరినాటికి లభ్యమవుతుంది. దీనిని అక్కౌంట్, సమూహాలకు, యూజర్ స్థాయిలను బట్టి ఎనేబుల్ చేయవచ్చు మరియు అక్కౌంట్ అడ్మిన్ ఏవిధంగా ఈ లక్షణాన్ని ఏర్పాటు చేస్తారు అనేదానిపై ఆధారపడి, ఒకదాని తరువాత మరొక సమావేశాల మధ్య హోస్ట్ మార్చుకొనే అవకాశాన్ని అందిస్తుంది. ఎనేబుల్ చేయబడినప్పుడు, Zoom’s E2EE, Zoom అప్లికేషన్స్ ఉపయోగించే భాగస్వాముల మధ్య కమ్యూనికేషన్, ఆయ్ఆ భాగస్వాముల డివైజ్‌లలో మాత్రమే ఉన్న క్రిప్టోగ్రాఫిక్ కీలు ఉపయోగించి ఎన్‌క్రిప్ట్ చేయబడతాయి.
కస్టమైజ్ చేసిన SDK: ప్రస్తుతమున్న తన SDKలకు Zoom కొత్త హంగులను చేరుస్తోంది. ఇది డెవలపర్లు మరియు కంపెనీలు, Zoom ప్లాట్‌ఫారంతో తమ స్వంత వీడియో-ఆధారిత అప్లికేషన్లను ఉన్నతీకరించుకోవచ్చు. ఇది Android, iOS మరియు వెబ్లపై లభ్యమవుతుంది. డెవలపర్లు, కస్టమైజ్ చేయబడిన యుఐ మరియు సెషన్ నియంత్రణ చేసుకోవడంద్వారా ఉత్తమ-నాణ్యతగల వీడియో, ఆడియో మరియు ఇన్స్టంట్ చాట్లు తమ అప్లికేషన్స్ పొందడానికి వీలవుతుంది.