హైదరాబాద్ : ప్రముఖ డయాలసిస్ నెట్‌వర్క్ సంస్థ నెఫ్రోప్లస్ తొలిసారి విదేశాలకు విస్తరించింది. ఫిలిప్పీన్స్‌లోని రాయల్ కేర్ డయాలిసిస్ సెంటర్స్ ఇన్ కార్పొరేషన్ (ఆర్‌సీడీసీ)లో 51 శాతం మెజారిటీ వాటాను స్వాధీనం చేసుకున్నట్టు నెప్రోప్లస్ వ్యవస్థాపకులు, సీఈఓ విక్రమ్ వుప్పల తెలిపారు. దీంతో తొలి సారి తాము విదేశాలకు విస్తరించినట్లయ్యిందని పేర్కొన్నారు. ఆర్‌సీడీ నెట్‌వర్క్‌కు ఫిలిప్పిన్స్‌లో 400 డయాలసిస్ సెంటర్‌లు ఉన్నాయన్నారు. అయితే దీన్ని ఎంత మొత్తానికి స్వాధీనం చేసుకుందనే విషయాన్ని వెల్లడించలేదు. నెప్రోప్లస్ ప్రస్తుతం దేశంలో 20 రాష్ట్రాల్లోని 132 పట్టణాల్లో 230 డయాలసీస్ కేంద్రాలను నిర్వహిస్తుంది. డిసెంబర్ ముగింపు నాటికి 240కి విస్తరించనున్నట్లు విక్రమ్ తెలిపారు. ఆర్‌సీడీసీ స్వాధీనం ద్వారా తమ ఉద్యోగుల సంఖ్య 3,800 నుంచి 4,200కు చేరిందని ఆ సంస్థ తెలిపింది.